అధికారపక్షమా..? ప్రతి పక్షమా..?

ABN , First Publish Date - 2021-05-08T07:29:52+05:30 IST

అధికార పార్టీ వైసీపీలో మొదటి నుంచి ఉండి కష్టపడి పని చేసి అధికారంలోకి వచ్చాక మరో వర్గం వారు అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని జిల్లా సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ చింతా శ్రీనివాసరెడ్డి, పసుపుగల్లు సర్పంచ్‌ వరగాని బాలసుందరరావులు ఆరోపించారు.

అధికారపక్షమా..? ప్రతి పక్షమా..?
మాట్లాడుతున్న చింతా శ్రీనివాసరెడి

సర్పంచ్‌ల సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి ఆవేదన 

పనులు పక్కదారి పై నిరసన 

ముండ్లమూరు, మే 7 : అధికార పార్టీ వైసీపీలో మొదటి నుంచి ఉండి కష్టపడి పని చేసి  అధికారంలోకి వచ్చాక మరో వర్గం వారు అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని జిల్లా సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ చింతా శ్రీనివాసరెడ్డి, పసుపుగల్లు సర్పంచ్‌ వరగాని బాలసుందరరావులు ఆరోపించారు. శుక్రవారమిక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను చేయించుకొనే విషయంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తమకు కాకుండా మరొకరికి పనులు చేయాలని అధికారులకు చెప్పటం చూస్తే తాము అధికార పక్షమో... ప్రతిపక్షమో అర్థం కావటం లేదన్నారు. మూడు నెలల క్రితం సర్పంచ్‌గా బాలసుందరరావు గెలిస్తే పంచాయతీ పరిధిలో ఉన్న వాటర్‌ ప్లాంట్‌ ఇంత వరకు అప్పజెప్పలేదన్నారు. గ్రామంలో గ్రీన్‌ అంబాసిడర్లను నియమించాల్సి ఉంటే ఆ విషయమై సంబంధిత అధికారుల వద్దకు వెళితే.. మిమ్మల్ని కాకుండా ఎమ్మెల్యే మరొకరి పేరు చెప్పారని చెప్పటం దారుణమన్నారు. సీనియర్లను పక్కనబెట్టి ఏమాత్రం అవగాహన లేని వారి మాటలు నమ్ముతూ పార్టీని భ్రష్టుపట్టించారని విమర్శించారు. మండలంలో ఇసుక అక్రమ వ్యాపారం దగ్గర నుంచి అనేక పనుల్లో అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎస్సై వెంకట సైదులు కూడా ఒక వర్గానకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారన్నారు. ఇలాంటి వైఖరిని మార్చుకోవలన్నారు. మండల ఇన్‌చార్జ్‌ కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో సమస్యలు వచ్చాయన్నారు. పసుపుగల్లులో సిమెంట్‌ రోడ్లు వేసేందుకు తీసుకొచ్చిన సిమెంట్‌ను ఇతరులకు విక్రయించారని ఆరోపించారు. ఈ పరిస్థితులను ఇప్పటికే రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా పలు మార్లు వివరించామని శ్రీనివాసరెడ్డి చెప్పారు. సమావేశంలో ఉప సర్పంచ్‌ బిజ్జం కృష్ణారెడ్డి, దళిత నాయకులు కంభంపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T07:29:52+05:30 IST