పకడ్బందీగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-07T10:30:05+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు

పకడ్బందీగా లాక్‌డౌన్‌

31 అనుమానితుల నుంచి రక్త నమూనాల సేకరణ 

ఇద్దరికి పాజిటివ్‌, 29 మందికి నెగెటివ్‌ 


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. గోదావరిఖని జీఎం కాలనీలో ఒకరికి, రామగుండం అన్న పూర్ణ కాలనీలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాంతాల్లోని ప్రజల ను అప్రమత్తం చేశారు. కిలోమీటర్‌ దూరం వరకు రెడ్‌ జోన్‌లుగా ప్రకటించారు. వైరస్‌ సోకిన వారి కుటుంబ సభ్యులను, ఇతరులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. జిల్లాలో కరోనా సోకిందనే అనుమానాలతో 31 మంది నుంచి రక్త నమునాలను సేకరించిన అధికారులు హైదరాబాద్‌కు పరీక్షల కోసం పంపించారు. ఇందులో ఇద్దరు మినహా 29 మందికి ఎలాంటి కరోనా వైరస్‌ సోకలేదని నిర్దారణ అయ్యింది.


ప్రస్తుతం గర్రెపల్లి కార్వంటైన్‌ కేంద్రంలో 53 మంది, నంది మేడారం క్వారంటైన్‌ కేంద్రంలో 15 మంది ఉండగా, సుల్తానాబాద్‌ ఐసోలేషన్‌ కేంద్రంలో 35 మంది పెద్దపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో, ముగ్గురు అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి 1,098 మంది వచ్చినట్లుగా అధికారులు గుర్తించి వారికి స్టాంపులు వేసిన విషయం తెలిసిందే. వారియొక్క 14 రోజుల క్వారంటైన్‌ గడువు కూడా ముగియ వస్తున్నది.


అయితే వీరందరిని లాక్‌డౌన్‌ వరకు హోం క్వారంటైన్‌లోనే ఉంచాలని ప్రభుత్వం ఆదేశించడంతో వారిని ఇండ్ల నుంచి బయటకు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఢిల్లీ మర్కజ్‌కు జిల్లా నుంచి వెళ్లి వచ్చిన ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌ రాగా, మిగిలిన వ్యక్తులకు నెగిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా వీరిని క్వారంటైన్‌ కేంద్రాల్లోనే ఉంచినట్లుగా అధికారులు చెబుతున్నారు.

 

గోదావరిఖని జీఎం కాలనీలో ఒక యువకుడికి పాజిటివ్‌ రాగా ఆ ప్రాంతంలో వివిధ రసాయనాలతో పిచికారి చేయిస్తున్నారు. ము రికి కాలువలపై బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతూ పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుతున్నారు. గ్రామాల్లో ప్రజలంతా వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతున్నారు. ఇక్కడ పెద్దగా లాక్‌డౌన్‌ అమలవుతున్న ట్లుగా కనబడం లేదు. గ్రామాల్లో వరి పొలాలు, మొక్కజొన్న చేను లు కోతకు రావడంతో వాటిని కోస్తున్నారు. ధాన్యాన్ని, మక్కలను కొ నుగోలు చేసేందుకు అధికారులు కేంద్రాలను ఆరంభించారు. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సుల్తానాబాద్‌ ఐసోలేషన్‌ కేంద్రాన్ని, గర్రెపల్లి క్వా రంటైన్‌ కేంద్రాన్ని సందర్శించి డాక్టర్లు, అధికారులకు పలు సూచ నలు జారీ చేశారు.  పంట ఉత్పత్తుల కోతలు, అమ్మకాల విషయం లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధి కారులను కలెక్టర్‌ ఆదేశించారు. మొక్కజొన్న పంటకు చెల్లింపులను ఎప్పటికప్పుడు చేయాలని కలెక్టర్‌ అధికా రులకు ఆదేశించారు. 


రామగుండంలో పటిష్ట చర్యలు..

కోల్‌సిటీ: రామగుండంలో కరోనా పాజిటివ్‌ నమోదు అయిన ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీ, గోదావరిఖని జీఎం కాలనీలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. ఈ రెండు ప్రాంతాల్లో బయటి ప్రాంతాల వారు లోనికి రాకుండా, లోపలి వారు బయటికి పోకుండా కట్టడి చేశారు. కాలనీలకు వెళ్లే అన్ని మార్గాలను పైపులు కట్టి, బారికేట్లతో పోలీసులు మూసివేశారు. సోమవారం గోదవారిఖని జీఎం కా లనీలో ఫీవర్‌ సర్వే నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి 20 బృందా లు ఈ సర్వే నిర్వహించాయి. 44మందికి స్టాంపింగ్‌ వేసి, 102 మందిని గృహ నిర్బంధంలో ఉంచాలని సూచించారు.


రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మేయర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు జీఎం కాలనీలో పర్యటించారు. ఎ వరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పోలీసులకు కానీ, ము న్సిపల్‌ కార్పొరేషన్‌, వైద్య సిబ్బందికి తెలియజేయాలని కోరారు. రా మగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాలనీ మొత్తా న్ని హైపోక్లోరైడ్‌, బ్లీచింగ్‌ చల్లించారు.  కాగా పోలీ స్‌ బందోబస్తు పటిష్ఠం చేశారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌, సీఐ పర్స రమేష్‌ ఎప్పటికప్పు డు పరిస్థితిని సమీక్షిస్తున్నా రు. డీసీపీ రవీందర్‌ రెడ్‌జోన్‌ ప్రాంతాలను పరిశీలించారు.


నేటి నుంచి నిత్యావసర  సరుకుల పంపిణీ

రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో మంగళవారం నుంచి కూరగాయలతోపాటు ఇతర నిత్యావసరాలను ఇళ్ల వద్దకే పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇంటింటికీ నిత్యావసర వస్తువులు ఆర్డర్‌పై అందించేందుకు కొన్ని సూపర్‌ మార్కెట్లు, సంస్థలు ముందుకు వచ్చాయి. సోమవారం వన్‌టౌన్‌ సీఐ పర్స రమేష్‌ వారికి పాస్‌లను అందజేశారు.

Updated Date - 2020-04-07T10:30:05+05:30 IST