Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్మీ, నేవీలో యువతకు మెరుగైన ఉపాధి

నరసరావుపేట టౌన్‌, డిసెంబరు7: భారత ప్రభుత్వం ఇండియన్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో యువతకు మెరుగైన ఉపాధి అందిస్తోందని  గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీసర్‌ మేజర్‌ సుధీర్‌ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో 23 ఆంధ్ర బెటాలియన్‌ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ఎన్‌సీసీ కాడెట్స్‌కు ఆర్మీపై అవగాహన కల్పించారు. మేజర్‌ సుధీర్‌ మాట్లాడుతూ టెక్నికల్‌ విభాగాల్లోనూ అత్యుత్తమమైన ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు. ఎన్‌సీసీ ఏ, బీ, సీ సర్టిఫికెట్స్‌తో  మంచి ఉపయోగాలు ఉన్నట్లు చెప్పారు. మేజర్‌ సుధీర్‌, సుబేధార్‌ కిషన్‌ కుమార్‌, బీహెచ్‌ఎం దీల్లేశ్వరరావు, హవల్‌దార్‌లు రిషీపాల్‌, గాలియ్యను కళాశాల కమిటీ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్‌ సన్మానించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ ఆఫీసర్‌లు మేజర్‌ జీవీ రావు, బీఎస్‌ఆర్‌కే రాజు, వై.అంజిరెడ్డి, అన్ని కళాశాలల ఎన్‌సీసీ కాడెట్స్‌ పాల్గొన్నారు. 

  

Advertisement
Advertisement