Abn logo
Apr 10 2021 @ 23:57PM

వైటీసీలో వసతుల కల్పనకు ఏర్పాట్లు

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 10: గుమ్మలక్ష్మీపురం యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ లో వసతుల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఐటీడీఏ  పీవో  ఆర్‌.కూర్మనాథ్‌ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమశాఖ ఇంజినీర్‌ శాంతేశ్వరరావు శనివారం వైటీసీ పరిశీలించారు. గర్భిణుల వసతి గృహాన్ని కూడా  సందర్శిం చారు. మరుగుదొడ్లు, బాత్‌రూములు పాడైన కారణంగా వీటిని మరమ్మతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. వంట గది, తాగునీటి ఏర్పాట్లు, మురుగు కాలువ నిర్మాణాలు, తదితర పనులపై కిందిస్థాయి ఇంజినీర్లతో చర్చించారు.   భద్రగిరి గిరిజన సంక్షేమశాఖ డీఈ సింహాచలం, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, తదితరులు ఉన్నారు.

 

Advertisement
Advertisement
Advertisement