నిరాడంబరంగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-01-26T06:44:34+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

నిరాడంబరంగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు
గణతంత్ర వేడుకలకు సిద్ధమైన కలెక్టరేట్‌ ప్రాంగణం

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 25: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కాకుండా కలెక్టరేట్‌ కార్యాల యం ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10గంటలకు కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అంతకుముందు 9:55 నిమిషాలకు కలెక్టరేట్‌కు చేరుకుని పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ప్రసం గాలు చేయడం, ఆస్తుల పంపిణీ, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీ చేయడం, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటివి ఉండవని అధికారు లు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-26T06:44:34+05:30 IST