బీజేపీ నాయకుల అరెస్టు సరికాదు : గూడూరు

ABN , First Publish Date - 2021-06-23T06:40:05+05:30 IST

ఆలేరు నియోజకవర్గ, మండల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని కోరేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, రాష్ట్ర నాయకుడు గూ డూరు నారాయణరెడ్డి అన్నారు.

బీజేపీ నాయకుల అరెస్టు సరికాదు : గూడూరు
తుర్కపల్లిలో రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు గూడూరు, శోభారాణి

తుర్కపల్లి, జూన్‌ 22: ఆలేరు నియోజకవర్గ, మండల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని కోరేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, రాష్ట్ర నాయకుడు గూ డూరు నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్ట్‌లు చెరువు లేవని, లక్ష ఎకరాలకు సాగునీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫాం హౌస్‌ నుంచి యాదగిరిగుట్ట వరకు వేస్తున్న రోడ్డు విస్తరణ పనుల్లో భూము లు, ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గంధమల్ల, బస్వాపూర్‌ ప్రాజెక్ట్‌ల నిర్మా ణంలో భములు కోల్పోతున్న భూ నిర్వాసితులతో గ్రామ సభ నిర్వహిం చి వారికి భరోసానివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కొక్కొండ లక్ష్మీనారా యణ, నాగినేనిపల్లి ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి, నాయకులు అకుల రమేష్‌, ఆకుల సైదులు, గూగూరు నరోత్తమ్‌రెడ్డి, పి ప్రవీణ్‌, రమేష్‌, దూప్‌సింగ్‌నాయక్‌; సీతనారాయణ, మోత్కుపల్లి రవి, నవీన్‌; లింగానాయక్‌ తదితరులు ఉన్నారు. 

ఆత్మకూరు(ఎం): నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళిన బీజేపీ నాయకులు బండ్రు శోభారాణి, గూడూరు నారాయణ రెడ్డి లతోపాటు పలువురిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం  అప్రజాస్వామికమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేతల అరెస్టును ఖండించారు. నియోజకవర్గంలో 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఆగిపోయిన బూనాదిగాని కాల్వ నిర్మాణ పనులు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ రాష్ట్రంలో  రాక్షస పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు గుణపాఠం తప్పద న్నారు. సమావేశంలో మండల కార్యదర్శి ఎన్‌.బిక్షపతి, కుమారస్వామి, కాశీనాధ్‌, బండి ఉప్పలయ్య, రవీందర్‌,వెంకటయ్య పాల్గొన్నారు.

రాజాపేట: గంధమల్ల ప్రాజెక్ట్‌పై  ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేయడం తగదన్నారు. సమ స్యలను ప్రభుత్వం దృష్టికీ తీసుకురావడం తప్పాఅని  ప్రశ్నించారు. గంధమల్ల ప్రాజెక్ట్‌ నిర్మించి రైతులను ఆధుకోవాలని కోరారు. ఈ కార్య క్రమంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి బాల్‌రెడ్డి, సిద్దేశ్వర్‌, రాజు, సిద్దులు, బీరయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T06:40:05+05:30 IST