చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్టు

ABN , First Publish Date - 2022-09-04T06:18:58+05:30 IST

వేములవాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దంపతు లను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలి పారు.

చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

సిరిసిల్ల క్రైం, సెప్టెంబరు 3: వేములవాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దంపతు లను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలి పారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వివరాలు వెల్లడించారు. ఆగస్టు 14న అర్థరాత్రి వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ వీధిలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన దొంగలు అందినకాడికి దోచుకెళ్లారని, ఈ సంఘటనపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి 15 రోజుల్లో ఛేదించామని తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బట్వాన్‌పల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి ధనలక్ష్మి (30), తాళ్లపల్లి ప్రసాద్‌ (31) అనే దంపతులను వారి ఇంటి వద్ద ఉండగా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వేములవాడలోని ఓ ఇంట్లో దొంగిలించిన సొమ్ములో 31.8 తులాల బంగారు ఆభరణాలు, 32.5 తులాల వెండి అభరణాలు, రూ.11,500 నగదును వారి వద్ద నుంచి రికవరీ చేశామన్నారు. ఈ దంపతులు గతేడాది మే 4న వేములవాడ అర్బన్‌ మండలం లోని రుద్రవరంలోనూ ఓ ఇంట్లో చొరబడి బం గారు, వెండి అభరణాలు, నగదును దోచు కెళ్లార న్నారు. ఈ సంఘటనలోనూ 6 తులాల బంగారు అభరణాలు రికవరీ చేశామన్నారు. గతంలో విజయవాడ, మంచిర్యాల ప్రాంతాల్లో అనేక దొంగత నాలకు పాల్పడ్డారని, ఆ కేసుల్లో ధనలక్ష్మి జైలుకు వెళ్లి ఆగస్టు 12నవిడుదలై భర్తతో కలిసి వేముల వాడలో దొంగతనానికి పాల్పడిందని అన్నారు. ప్రజలు ఇంట్లో విలువైన అభరణాలు, నగదును పెట్టుకోవద్దని, బ్యాంకు లాకర్‌లో భద్రపరుచు కోవాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని,  పక్కింటివారికి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.  కేసును ఛేదించిన టౌన్‌ సీఐ వెంకటేశ్‌, ఎస్సై రమేశ్‌, ముగ్గురు కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేముల వాడ డీఎస్పీ నాగేంద్రచారి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-04T06:18:58+05:30 IST