Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కేటుగాడు అరెస్ట్

కడప: అమ్మాయిలు, మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 200 మంది అమ్మాయిలు, 100 మంది మహిళలను ప్రొద్దుటూరుకి చెందిన ప్రసన్నకుమార్ మోసం చేశాడు. పలు పేర్లతో సోషల్ మీడియాలో అమ్మాయిలకు వల వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. విజయవాడ, హైదరాబాద్, కడపలో అమ్మాయిలకు ఎర వేసినట్లు పోలీసులు గుర్తించారు. కడపలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించడంతో ఉదంతం బయటపడింది. నిందితుడి వద్ద నుంచి 1.26 లక్షల నగదు, 30 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కడప డీఎస్పీ సునీల్ తెలిపారు.

Advertisement
Advertisement