Advertisement
Advertisement
Abn logo
Advertisement

రేపు సీఎం జగన్‌ రాక

మందపల్లెలో బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి

వరద ప్రాంతాల్లో పర్యటన


రాజంపేట / కడప, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎ్‌స జగన్‌మోహన్‌రెడ్డి 2వ తేదీ గురువారం వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సీఎం జగన్‌ 2వ తేదీ ఉదయం 10.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి రాజంపేట మండలంలోని నవోదయ విద్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి పులపుత్తూరు, మందపల్లి, తెగిన అన్నమయ్య ఆనకట్ట ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకు వరద నష్ట అంచనాల పై అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం చిత్తూరు జిల్లాకు బయలుదేరుతారు.


ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్‌ 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో 2వ తేదీ గురువారం పర్యటించనున్న సందర్భంగా మంగళవారం కలెక్టర్‌ విజయరామరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పులపత్తూరు, మందపల్లె గ్రామాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. పునరావాస కార్యక్రమాలు, ప్రభుత్వ సహాయ సహకారాలు తదితర అంశాలపై ఆరా తీశారు. జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డితో కలిసి ఈ ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement