Abn logo
Oct 15 2021 @ 02:17AM

ఆర్యన్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడు

బెయిల్‌ వద్దన్న ఎన్‌సీబీ న్యాయవాది


షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకునేవాడని మాదకద్రవ్యాల నిరోధక బృందం(ఎన్‌సీబీ) తెలిపింది. ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఎన్డీపీఎస్‌ ప్రత్యేక కోర్టు విచారణ సందర్భంగా ఎన్‌సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ‘‘విదేశాల్లో డ్రగ్స్‌ పెడ్లర్ల తోనూ అతనికి సంబంధాలున్నట్లు వాట్సాప్‌ చాటింగ్‌ డేటా చెబుతోంది. విదేశాంగ శాఖ అధికారుల సాయంతో వారిని గుర్తించే ప్ర యత్నం చేస్తున్నాం’’ అని వివరించారు. ఆర్యన్‌ తరఫున వాదించిన అమిత్‌ దేశాయ్‌ ఈ ఆరోపణలను ఖండించారు. ఆర్యన్‌ వద్ద డ్రగ్స్‌ దొరకనేలేదని, వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా నిర్బంధించడం సరికాదన్నారు. తీర్పును న్యాయమూర్తి 20వ తేదీకి రిజర్వ్‌ చేశారు. దీంతో ఆర్యన్‌ను తిరిగి ముంబై ఆర్థర్‌రోడ్‌ జైలుకు పంపారు. కాగా, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరైంది.