Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరికొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా.. ఈ మహిళా పోలీసు ఏం చేసిందో మీరే చూడండి..

పోలీసు వృత్తిలో ఉన్నవారు చాలా మంది.. తమ వృత్తి పట్ల అంకితభావంతో ఉంటారు. కొందరు మాత్రం తమ డిపార్ట్‌మెంట్ పరువు తీస్తుంటారు. రాజస్థాన్‌లో ఓ మహిళా పోలీసు చేసిన పని.. స్థానికంగా హాట్ టాపిక్ అయింది. ఈ విషయం ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. మరి కొద్ది రోజుల్లో ఆమె పెళ్లి ఉంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు చెడ్డపేరు తెచ్చేలా ఆమె చేసిన పనితో అందరి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని బార్లుట్ పోలీస్ స్టేషన్‌లో సీమా జఖర్ అనే మహిళ ఉద్యోగం చేస్తోంది. నవంబర్ 28న ఆమె వివాహం ఉంది. ఈ సమయంలో వేరే వారు ఎవరైనా పెళ్లి తర్వాత జీవితాన్ని తలచుకుంటూ ఆనందంగా ఉంటారు. కానీ ఈ మహిళ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లింది. ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఆమెకు ఆశ పుట్టింది. ఓ స్మగ్లర్‌తో రాజీ కుదుర్చుకుంది. రూ.10 లక్షలు ఇస్తే విడిచిపెడతానని అతడితో ఒప్పందం చేసుకుంది.

ఒప్పందం ప్రకారం ఆ స్మగ్లర్.. ఆమెకు నగదు పంపించాడు. అయితే ఈ తంతు మొత్తం స్థానికంగా ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డు అయింది. బయటికి రావడంతో  జిల్లా ఎస్పీ ధర్మేంద్ర సింగ్ యాదవ్ స్టేషన్‌కు చేరుకున్నారు. సీసీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులను విచారించారు. నేరం రుజువవడంతో ఆమెను సస్పెండ్ చేశారు. అనంతరం సీమా సహా మరో ముగ్గురు కానిస్టేబుల్స్‌ను కూడా సస్పెండ్ చేశారు. పది రోజుల్లో పెళ్లి ఉందనగా ఇలాంటి పనులు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement