Panjshir valley: వాలీబాల్ ఆడుతున్న రెసిస్టెన్స్ ఫైటర్స్..ఫొటో వైరల్

ABN , First Publish Date - 2021-08-24T13:35:45+05:30 IST

అఫ్ఘానిస్థాన్ దేశంలోని పంజ్‌షీర్ రెసిస్టెన్స్ ఫైటర్స్ తాలిబన్లకు సవాలు విసిరి వార్తల్లోకెక్కారు....

Panjshir valley: వాలీబాల్ ఆడుతున్న రెసిస్టెన్స్ ఫైటర్స్..ఫొటో వైరల్

పంజ్‌షీర్ (అఫ్ఘానిస్థాన్) : అఫ్ఘానిస్థాన్ దేశంలోని పంజ్‌షీర్ రెసిస్టెన్స్ ఫైటర్స్ తాలిబన్లకు సవాలు విసిరి వార్తల్లోకెక్కారు.అష్రఫ్ ఘనీ పాలనలో అఫ్ఘాన్ ప్రథమ ఉపాధ్యక్షుడు అయిన అమ్రుల్లా సలేహ్ రెసిస్టెన్స్ ఫైటర్స్ లో చేరారు. అమ్రుల్లా సలేహ్ రెసిస్టెన్స్ ఫైటర్స్ తో కలిసి పంజ్ షీర్ లోయలో పర్వతం చెంత వాలీబాల్ ఆడుతున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.తాలిబన్ల పాలనను ఎదిరించడానికి సలేహ్ రద్దు చేసిన అఫ్ఘాన్ సాయుధ దళ సిబ్బంది, స్థానిక మిలీషియాలతో చేతులు కలిపారు. సోవియట్ వ్యతిరేక ముజాహిదీన్ కమాండర్ అహ్మద్ షా మసూద్ కుమారుడు నేతృత్వంలోని  రెసిస్టెన్స్ ఫైటర్స్ కాబూల్‌కు వాయువ్యంగా ఉన్న పంజ్‌షీర్ లోయలో ఉంది.ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా చిత్రంలో పంజ్‌షీర్ లోయలో చాలా మంది పురుషులు వాలీబాల్ ఆడుతున్నప్పుడు అమ్రుల్లా సలేహ్ నవ్వుతూ కనిపిస్తారు. 


సలేహ్ వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు.అఫ్ఘాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అష్రఫ్ ఘని లేనప్పుడు అఫ్ఘానిస్తాన్‌కు ఉపాధ్యక్షుడైన తానే చట్టబద్ధమైన తాత్కాలిక అధ్యక్షుడని అమ్రుల్లా సలేహ్ గత వారం ఒక ట్వీట్‌ చేశారు.కాగా సలేహ్ వాదనను ఐక్యరాజ్యసమితితో పాటు ఏ దేశం లేదా అంతర్జాతీయ సంస్థ ఇంకా గుర్తించలేదు.అఫ్ఘానిస్తాన్‌లోని అన్ని ప్రావిన్సులు ఇప్పుడు తాలిబన్ పాలనలో ఉండగా, ఉత్తర పంజ్‌షీర్ ప్రావిన్స్ తాలిబన్లను నిరోధించగలిగింది. 2001 లో అఫ్ఘానిస్తాన్‌పై అమెరికా దండయాత్రకు ముందు కూడా పంజ్‌షీర్ తాలిబన్ పాలనను ప్రతిఘటించారు


Updated Date - 2021-08-24T13:35:45+05:30 IST