కనీస వేతనం కోసం ఆశా వర్కర్ల నిరసన

ABN , First Publish Date - 2020-09-23T21:45:12+05:30 IST

ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల్లో ఆశా వర్కర్లు సేవలు ప్రధానంగా ఉంటున్నాయి. కానీ ఆశా వర్కర్ల జీతాలు, జీవితాలు చాలా దుర్భరంగా తయారవుతున్నాయి. వారు నిర్వర్తించే కర్తవ్యానికి అందే ప్రతిఫలానికి ఏమాత్రం పొంతన ఉండడం లేదు

కనీస వేతనం కోసం ఆశా వర్కర్ల నిరసన

బెంగళూరు: కనీస వేతనం కోసం కర్నాటకలోని ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. అంతే కాకుండా కోవిడ్-19 సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు రోజువారి పరీక్షలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బెంగుళూరులోని ఫ్రీడం పార్కలో నిర్వహించిన సమావేశానికి ఆశావర్కర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు.


‘‘ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల్లో ఆశా వర్కర్లు సేవలు ప్రధానంగా ఉంటున్నాయి. కానీ ఆశా వర్కర్ల జీతాలు, జీవితాలు చాలా దుర్భరంగా తయారవుతున్నాయి. వారు నిర్వర్తించే కర్తవ్యానికి అందే ప్రతిఫలానికి ఏమాత్రం పొంతన ఉండడం లేదు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 12,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే కోవిడ్-19 సేవలో ఉన్న ఆశా వర్కర్లకు రోజూ వారీగా వైద్య పరీక్షలు చేయాలి’’ అని సభా నిర్వాహకులు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-23T21:45:12+05:30 IST