సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసినందుకు ఎమ్మెల్యే అరెస్ట్

ABN , First Publish Date - 2020-04-09T23:52:39+05:30 IST

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసినందుకు గాను దాదాపు 59 మందిపై సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అమల్ దాస్

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసినందుకు ఎమ్మెల్యే అరెస్ట్

అసోం : కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై అసోం ప్రభుత్వం గురువారం కొరడా ఝులిపించింది. ఓ ఎమ్మెల్యే, ఆర్మీ జవాన్‌తో పాటు మరో 33 మందిని అసోం ప్రభుత్వం అరెస్టు చేసింది. సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను నాగోన్ ఎమ్మెల్యే అమిన్యుల్ ఇస్లామ్ ను పోలీసులు అరెస్టు చేశారు.  సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసినందుకు గాను దాదాపు 59 మందిపై సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అమల్ దాస్ అనే ఆర్మీ జవాన్‌పై 153(ఏ), 295 (ఏ), 506 ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు 1,272 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. 

Updated Date - 2020-04-09T23:52:39+05:30 IST