Advertisement
Advertisement
Abn logo
Advertisement

గొర్రెలకాపరి కుటుంబసభ్యులకు అప్పగింత

దేవరకొండ, డిసెంబరు 1: దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామానికి చెందిన షేక్‌ నయిం అనే యువకుడు మేకలు మేపుతూ మాడ్గుల మండలం అందుగుల గ్రామశివారులో కనిపించినట్లు దేవరకొండ సీఐ బీసన్న తెలిపారు. షేక్‌ నయిం తనకున్న 30 మేకలను మేపేందుకు నవంబరు 29న ఇంటి నుంచి బయలుదేరి కనిపించకుండా పోయాడు. రాత్రికి నయింతోపాటు మేకలు ఇంటికిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నవంబరు 30న దేవరకొండ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అందుగుల గ్రామ శివారులో నయిం స్పృహతప్పి పడిపోయి ఉన్నట్లు స్థానికులు బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవరకొండ పోలీసులు అందుగులకు వెళ్లి అస్వస్థతకు గురైన షేక్‌ నయింను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు. అనంతరం అతనిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐతెలిపారు. 30 మేకలలో 17మేకలు దొరికాయని, మరో 13మేకలు కనిపించకుండా పోయాయని సీఐ పేర్కొ న్నారు. సరైన ఆహారం తినకపోవడం, మేకలను మేపుతూ ఎక్కువదూరం నడవడం వల్ల నయిం అస్వస్థతకు గురైనట్లు సీఐ తెలిపారు. 


Advertisement
Advertisement