నగదు రూపంలో సాయం అందించాలి

ABN , First Publish Date - 2020-04-07T10:27:56+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించనున్న రూ.1500లను నగదు రూపంలో

నగదు రూపంలో సాయం అందించాలి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


జగిత్యాల టౌన్‌, ఏప్రిల్‌ 6: కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించనున్న రూ.1500లను నగదు రూపంలో అందించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అంతర్‌ రాష్ట్ర వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యంతో పాటు నగదు  అందించిందని, అదే తరహాలో స్థానిక కూలీలకు కూడా రేషన్‌కార్డులతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం అం దించాలని డిమాండ్‌ చేశారు. కరోనా లక్షణాలు ఎవరికి ఉన్నా తక్షణమే వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా ఇచ్చే ఆరు కిలోల బియ్యం  ఇప్పటివరకు అందించలేదని అన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోలను కలుపుకుని 12 కిలోలు మాత్రమే అందిస్తుందని అన్నారు. పప్పు, చక్కెర, నూనె, గోధుమ పిండి అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, నాయకులు గిరి నాగభూషణం, బండ శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-07T10:27:56+05:30 IST