అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను అందుబాటులోకి తేవాలి

ABN , First Publish Date - 2021-12-04T05:46:56+05:30 IST

అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను విద్యా ర్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖకు సంబంధించిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల నిర్వహణపై సమీక్షించారు.

అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను అందుబాటులోకి తేవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

-   కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల డిసెంబరు 3 (ఆంరఽధజ్యోతి) : అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను విద్యా ర్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖకు సంబంధించిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల నిర్వహణపై సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ అటల్‌ టింకరింగ్‌ మార్గదర్శకాల ప్రకారం ఈ మార్కెట్‌ ఏజెన్సీ ద్వారా మేటీరియల్‌ ప్రొక్యూర్‌ చేశామని ప్రధానో పాధ్యాయులు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన 14 ల్యాబ్‌లలో 3 పాఠశాలలకు నిధులు జమ కాలేదని, 11 పాఠశాలల్లో నిర్మాణాలు పూర్తిదశలో ఉన్నాయని అన్నారు. నాలుగు పాఠశాలల్లో వర్క్‌షాపులు కూడా స్టార్ట్‌ చేసినట్లు  చెప్పారు.  సమావేశంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T05:46:56+05:30 IST