ఘోరం

ABN , First Publish Date - 2021-08-03T06:38:06+05:30 IST

పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ బొలెరో వాహనాన్ని ఢీకొంది.

ఘోరం
చెల్లాచెదురుగా పడిన టమోటాలు

బొలెరో వాహనాన్ని ఢీకొన్న లారీ

ముగ్గురు మృతి

డ్రైవర్‌కు తీవ్రగాయాలు

గుత్తి, ఆగస్టు 2: పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ బొలెరో వాహనాన్ని ఢీకొంది. దీంతో  కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన మహమ్మద్‌ లియాకత్‌ అలీ (52), మహమ్మద్‌ అష్రాఫ్‌ అలీ (65), కర్నూలుకు చెందిన మౌలానా షేక్‌ మహమ్మద్‌ ఖా సీం (33) అక్కడిక క్కడే మృతి చెందారు. బొలెరో డ్రైవర్‌ మౌ లానా హమీదుల్లా తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడి పరిస్థితి విష మంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు.  వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా దొడ్డిపాడు గ్రామానికి చెందిన మౌలానా షేక్‌ మహమ్మద్‌ ఖాసీం పెద్దటేకూరు మసీదులో ఇ మాంగా పని చేస్తున్నాడు.  గుల్బర్గాకు చెందిన మహమ్మద్‌ లియాకత్‌ అలీ, మహమ్మద్‌ అష్రాఫ్‌ అలీ మదరసాలో ఉర్దూ టీచర్లుగా ప ని చేస్తున్నారు. వీరు ముగ్గురూ డ్రైవర్‌ మౌ లానా హమీదుల్లాతో కలిసి తమిళనాడు, బెంగళూరులో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని ఆదివారం రాత్రి కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు. వీరి వాహనం గుత్తి శివారులోకి రాగానే టమోటా లోడుతో వస్తున్న రాజస్తాన్‌కు చెందిన లారీ రాంగ్‌రూట్‌లో ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్‌ మినహా అందులో ఉన్న మిగతా ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. టమోటాలు చెల్లాచెదురుగా పడ్డాయి. గుత్తి, పెద్దవడుగూరు సీఐలు రాము, రవిశంకర్‌ రెడ్డి, ఎస్‌ఐలు సుధాకర్‌ యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.వాహనంలో ఇరు క్కున్న మృతదేహాలను స్థానికుల సహకారంతో బయటకు తీశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు మౌలానా షేక్‌ మహమ్మద్‌ ఖాసీంకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కు మారుడు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరు, అతడి సహాయకుడు పరారీలో ఉన్నారు. ఈ సంఘటనపై గుత్తి సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





Updated Date - 2021-08-03T06:38:06+05:30 IST