ఎస్సీ,ఎస్టీలపై దాడులు అరికట్టాలి

ABN , First Publish Date - 2020-10-30T09:04:15+05:30 IST

ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఆపాలని, దాడులకు పాల్పడుతున్న అగ్రకులాలపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అద్యక్షులు కాసాని నాగరాజు డిమాండ్‌ చేశారు.

ఎస్సీ,ఎస్టీలపై దాడులు అరికట్టాలి

బుక్కరాయసముద్రం, అక్టోబరు 29: ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఆపాలని, దాడులకు పాల్పడుతున్న అగ్రకులాలపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అద్యక్షులు కాసాని నాగరాజు డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని వెంకటాపురంలో దళితులపై అగ్రకులాలు దాడిచేయడంపై మండల కేంద్రం బుక్కరాయసముద్రంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వెంకటాంపల్లి గ్రామానికి వెళ్లి గాయపడిన దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురంలో దళితులపై దాడిచేసిన నిందితులను అరెస్టు చేసినా పోలీసులు వారిని పెట్టారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ జేఏసీ కన్వీనర్‌ సాకే హరి, బీఎస్పీ జిల్లా నాయకులు తిరుపతయ్య, పున్నం రామాంజనేయులు, అంకె కుళ్లాయప్ప, చిన్న ఆంజనేయులు, ఆనంద్‌, రాఘవేంద్రమ్మ, సరస్వతి, రాచేపల్లి సాంబ పాల్గొన్నారు.


బాధితులకు పరామర్శ: దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని దళిత, గిరిజన సంఘాల జేఏసీ అద్యక్షుడు సాకే హరి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం మండల పరిధిలోని వెంకటాపురంలో అగ్రవర్ణాల దాడిలో గాయపడిన బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి దళితులపై జరుగుతున్న దాడులపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అద్యక్షులు కాసాని నాగరాజు, నాయకులు బీకేఎస్‌ ఆనంద్‌, బండారు కుళ్లాయప్ప, యల్లన్న, చిన్న ఆంజనేయులు, వనమాల నాగరాజు, అంకె కుళ్లాయప్ప, తిరుమలయ్య, తరిమెల రామాంజి, సాంబ, చంద్ర, హనుమంతు, రాజు, పెద్దన్న, సరస్వతి, రాఘవేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.


వైసీపీ అధికారంలోకి వచ్చాకే దాడులు...

గార్లదిన్నె: ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు కుళ్ళాయప్ప డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గంమైన శింగనమలలో ఎస్సీ, ఎస్టీ కులస్థులపై దాడులు ఎక్కువతున్నాయన్నారు. శింగనమల నియోజకవర్గం ఇలా ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే స్పందించకపోవడం భాదకరమన్నారు. హోంమంత్రి, ఎమ్మెల్యేలు స్పందించి దళితులపై జరుగుతున్న దాడులపై స్పందించి, ఎస్సీలపై దాడులు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Updated Date - 2020-10-30T09:04:15+05:30 IST