రేపు రేవా యూనివర్సిటీ ప్రత్యేక కెరీర్ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2021-07-30T06:24:05+05:30 IST
ఇంజనీరిం గ్ విద్యార్ధుల కోసం బెంగళూ రు నగరంలోని రేవా యూనివర్సిటీ శనివారం అనంతపురంలో ప్రత్యేక కెరీర్ కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
బెంగళూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరిం గ్ విద్యార్ధుల కోసం బెంగళూ రు నగరంలోని రేవా యూనివర్సిటీ శనివారం అనంతపురంలో ప్రత్యేక కెరీర్ కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఏ కోర్సులో చేరితే అద్భుతంగా రాణించి కెరీర్‌ను మలుచుకోవచ్చో విద్యార్థులకు ఈ ప్రత్యేక కౌన్సెలింగ్ సదస్సులో తెలియజేయనున్నా రు. సదస్సును ఉద్దేశించి రేవా యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ డా.ఎం.ధనుంజయ ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. అనంతపురంలోని రాజు రోడ్డులో ఉన్న హోటల్ మాసినేని గ్రాండ్లో నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌కు ఆసక్తి గల విద్యార్థులు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 99722 41717కు సంప్రదించాలని తెలిపారు.