Abn logo
Apr 19 2021 @ 00:57AM

జిల్లాకు చేరిన వ్యాక్సిన్‌

45 వేల డోసులకుపైగా రాక

నేడు వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ 

కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, ఏప్రిల్‌18 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో కరోనా టీకా వే యించుకోని హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులు, కార్మికులకు సోమవారం ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా వ్యాక్సిన్‌ వే స్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు.  ఆదివా రం ఆయన డీఎంహెచ్‌ఓ, జడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌పై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు 45 వేల డోసులకుపైగా వ్యాక్సిన్‌ వచ్చిందన్నారు.  సోమవారం ఉదయం 8 గంటల నుంచే వ్యాక్సినేషన్‌ను  ప్రారంభించాలన్నారు. వ్యాక్సి నేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌లో హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వందశాతం వ్యాక్సిన్‌ వేసిన తరువాతనే మిగిలిన వారికి వేయాలన్నారు. జిల్లాలోని సచివాలయాల్లో వేసుకోవడానికి ఇదివరకే సిద్ధం చేసిన జాబితాలోని వారికి వ్యాక్సిన్‌ వేయాలన్నారు. సాయంత్రం 5 గంటల్లోపు వ్యాక్సినేషన్‌ పూర్తిచేసి టీకా నిల్వలు జీరో పర్సెంట్‌కు తీసుకురావాలన్నారు. మున్సిపాల్టీలు, పట్టణ ప్రాంతాల్లో కలుపుకొని 50 శాతం మేరకు వ్యాక్సినేషన్‌ చేయించుకున్నారన్నారు. మిగిలిన 50 శాతాన్ని సోమవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలన్నారు. మున్సిపల్‌ శాఖ అప్‌లోడ్‌ చేసిన మేరకు ఇంకా 6 వేల మంది సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయించాలన్నారు. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎవరైనా వెనుకబడి ఉంటే సంబంధిత మున్సిపల్‌ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్‌లో ఇప్పటి వరకూ 60 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయించారన్నారు. మిగిలిన వారికి వేయించాలన్నారు. అందుకు సంబంధించి ఎంపీడీఓ, డివిజన్‌ పంచాయతీ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా వెనుకబడితే సంబంధిత ఎంపీడీఓలు, డివిజన్‌ పంచాయతీ అధికారులను సస్పెండ్‌ చేస్తామన్నారు. రెవెన్యూ శాఖలో 85 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. మిగిలిన 15 శాతాన్ని పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. 45 సంవత్సరాలు పైబడిన ఉపాధిహామీ కూలీలు, జాబ్‌కార్డులున్న వారికి వ్యాక్సిన్‌ వేయించాలని, ఇందుకు డ్వామా పీడీ చొరవచూపాలన్నారు. ముఖ్యంగా హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేయించేందుకు ఇదే చివరి అవకాశమన్నారు. తప్పనిసరిగా వందశాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. రానున్న రోజుల్లో కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నందున విధిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. కాగా.. కరోనా బాధితులకు సోమవారం సాయంత్రం నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో వైద్యసేవలు ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.


కొవిడ్‌ సర్వేలెన్స్‌ కాంటాక్ట్‌, ట్రేసింగ్‌ టీమ్‌ల ఏర్పాటు

జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా... పాజిటివ్‌ కాంటాక్ట్‌లను గుర్తించి ట్రేసింగ్‌, ట్రీట్మెంట్‌ ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి సర్వేలెన్స్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ టీమ్‌లను జిల్లా కలెక్టర్‌ ఏర్పాటు చేశారు. ఈ బృందంలో హంద్రీనీవా ఎస్‌డీసీఎల్‌ఏ రవీంద్ర, పీఏబీఆర్‌ ఎస్‌డీసీ శ్రీనివాసులు, విజిలెన్స్‌, ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ హుస్సేన్‌పీరా సభ్యులుగా ఉన్నారు. వైద్యశాఖ నుంచి 11 మంది సభ్యులతో జిల్లా ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ బృందంలో అదనపు డీఎంహెచ్‌ఓ రామసుబ్బారావు, జిల్లా మలేరియా అధికారి దోశారెడ్డి, ఫిజీషియన్‌ డా. భీమసేనాచారీ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పి. శ్రీనివా్‌సకుమార్‌, పీడియాట్రీషియన్‌ రామకిశోర్‌, మైక్రోబయాలజిస్ట్‌ డా. ప్రవీణ, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కరీముల్లా, ఎంపీహెచ్‌ఈఓ నారాయణరెడ్డి, ఎంపీహెచ్‌ఎ్‌స రమేష్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌లు చైతన్య, రాజశేఖర్‌ ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement