ఇసుక లీజుదారుడిపై దాడి

ABN , First Publish Date - 2020-07-14T10:39:35+05:30 IST

ముసినది వెంబడి లీజు మాటున పక్క స్థలం లో మరోసారి అక్రమంగా ఇసుక తరలిచేందుకు యత్నించిన అక్రమార్కుడిని సోమవారం ..

ఇసుక లీజుదారుడిపై దాడి

మూడురోజుల్లోనే రెండుసార్లు 

తవ్వుకునేందుకు యత్నించి భంగపాటు  

నెన్నూరుపాడు, పిడతలపూడి గ్రామస్థుల అడ్డగింత 

ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్లు పోలీసులకు అప్పగింత


కొండపి, జూలై 13 : ముసినది వెంబడి లీజు మాటున పక్క స్థలం లో మరోసారి అక్రమంగా ఇసుక తరలిచేందుకు యత్నించిన అక్రమార్కుడిని సోమవారం నెన్నూరుపాడు వాసులు అడ్డగించి దాడి చేశా రు. ఆ తర్వాత ఇసుక తవ్వేందుకు తెచ్చిన ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించారు. నెన్నూరుపాడు గ్రామంలోని ముసి వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివరాల్లోకెళ్తే... ఈనెల 10 న ఓ వ్యక్తి తాను ఇనుక ఎత్తుకు నేందుకు అనుమతి పొందానని ము సిలో ఇసుక తవ్వే ప్రయత్నం చేయగా నెన్నూరుపాడు వాసులు అడ్డుకున్నా రు. చీమకుర్తి, కొండపి మండలాలకు చెందిన సర్వేయర్‌లు హద్దులు తేల్చి లీజుదారు అనుమతి పొందిన ప్రాంతాన్ని చూపారు.


  లీజుదారు అనుమతి పొందిన స్థలంలో ఇసుక లేకపోవడంతో ఆరోజు లీజుదారు వెనుదిరిగి వెళ్లాడు. తిరిగి సోమవారం ఉదయం సంతనూతలపాడు మండలం మద్దులూరు గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి ఎక్స్‌కవేటర్‌, మూడు ట్రాక్టర్లను తీసుకువచ్చి నెన్నూరుపాడు పరిధిలోని ముసిహద్దులో ఇసుక తవ్వే ప్రయత్నం చేశాడు. సుబ్బారావు రాక వెనుక గతంలో వెనుదిరిగిన లీజుదారు మద్దతు ఉన్నదన్న అనుమానం పిడతలపూడి, నెన్నూరుపాడు ఇరు గ్రామాల వారికి వచ్చింది. దీంతో ఇరు గ్రామాల వారు ముసి వద్దకు చేరుకున్నారు. లీజుదారు పొందిన స్థలం చీమకుర్తి మండలం పిడతలపూడి గ్రామానికి చెందినది కాగా ఆ గ్రామ వాసులు కూడా వంద మందికి పైగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. లీజుదారుకు అనుమతి ఉన్నంతమాత్రాన అక్కడ ఉన్న మట్టిని ఎత్తితే తమ భూములపై ముసినీరు ప్రవహించి ముంపునకు గురవుతాయని, తాము కూడా లీజుదారు అనుమతి పొందిన ప్రాంతంలో మట్టిని ఎత్తనీయబోమని అడ్డుకున్నారు.


దీంతో సుబ్బారావు అనే వ్యక్తి జనాన్ని చూసి భయంతో ఎక్స్‌కవేటరు, ట్రాక్టర్లను వదిలి పరారయ్యాడు. తర్వాత ఇరు గ్రామాల ఫిర్యాదుతో చీమకుర్తి తహసీల్దార్‌ మధుసూదనరావు ఘటనా స్థలం వద్దకు చేరుకుని లీజుదారు అనుమతి పొందిన స్థలాన్ని పరిశీలించారు. లీజుదారు అనుమతి పొందిన ప్రాంతాన్ని వదిలి నెన్నూరుపా డు పరిధిలో ఇసుక ఎత్తేయత్నం చేశాడని నెన్నూరుపాడు వాసులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. పిడతలపూడి వాసులు కూడా తహసీల్దార్‌కు లీజు అనుమతి ఇచ్చిన స్థలంలో మట్టిని ఎత్తితే తమ పొలా లు దెబ్బతింటాయని, లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్ర పరిశీలనలో పిడతలపూడి వాసుల అభ్యర్థన సమంజసమేనని, లీజు రద్దుకు యత్నిస్తానని ఆయన హామీనిచ్చారు. ఇంతలో ఇసుక తవ్వేందుకు యత్నించిన వ్యక్తి తిరిగి రావడంతో ఒక్కసారిగా రెండు గ్రామా ల ప్రజలు అతడిపై వాదనకు దిగారు. దాడి చేశారు. అక్రమార్కుడితో సహా ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్లను కొండపి ఎస్సై ఎన్‌సీ ప్రసాద్‌, ఏఎస్సై హనుమంతరావులకు అప్పగించారు.


Updated Date - 2020-07-14T10:39:35+05:30 IST