తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు

ABN , First Publish Date - 2020-04-05T09:15:49+05:30 IST

జిల్లావ్యాప్తంగా శనివారం తూనికలు, కొలతల శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి కూరగాయల మార్కెట్‌, మెడికల్‌, కిరాణాషాపులు, ఆయిల్‌ మిల్లులు, మార్కెట్‌లపై దాడులుచేశారు. ఈసందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు 11 కేసులు నమోదు చేయగా... తెనాలిలో ఐదు, చిలకలూరిపేటలో నాలుగు కేసులు పెట్టారు.

తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు

 జిల్లాలో 11 కేసుల నమోదు


గుంటూరు (సంగడిగుంట), తెనాలిరూరల్‌, చిలకలూరిపేట, ఏప్రిల్‌ 4: జిల్లావ్యాప్తంగా శనివారం తూనికలు, కొలతల శాఖ అధికారులు  బృందాలుగా ఏర్పడి కూరగాయల మార్కెట్‌, మెడికల్‌, కిరాణాషాపులు, ఆయిల్‌ మిల్లులు, మార్కెట్‌లపై దాడులుచేశారు. ఈసందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు 11 కేసులు నమోదు చేయగా... తెనాలిలో ఐదు, చిలకలూరిపేటలో నాలుగు కేసులు పెట్టారు. ఈ మేరకు తూనికలు కొలతల శాఖల డిప్యూటీ కంట్రోలర్‌ ఎ.కృష్ణచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో దాడులు చేసినట్లు వివరించారు. 



తెనాలి మార్కెట్‌ సెంటర్‌ వద్ద పలు దుకాణాలపై తనిఖీలు నిర్వహించి ఐదింటిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పి.లిల్లి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నందున ఉదయం 6-9 గంటల వరకు మాత్రమే వ్యాపారులు షాపులు తెరిచి ఆయా వస్తువులు అమ్మకాలు జరపాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఆయాశాఖల అధికారులు నిరంజన్‌బాబు, శ్రీనివాస్‌ ప్రసాద్‌, ఇల్హనాన్‌ పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పలు దుకాణాలలో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించి, నాలుగింటిపై కేసులు నమోదుచేశారు. ఈ సందర్భంగా లీగల్‌ మెట్రాలజీ గుంటూరు అసిస్టెంట్‌ కంట్రోలర్‌ చల్లా దయాకరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విక్రయాలు జరపకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  దాడులలో సీఎస్‌డీటీ ఎన్‌ నాగమల్లేశ్వరరావు, జిఎస్టీ అధికారి భారత్‌, మార్కెటింగ్‌శాఖ అధికారి దిల్‌బహదూర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-05T09:15:49+05:30 IST