Advertisement
Advertisement
Abn logo
Advertisement

అట్టహాసంగా గండి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం

చక్రాయపేట, నవంబరు 29: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సం సోమ వారం అట్టహాసంగా జరిగింది.  ఆల య నూతన చైర్మన్‌ పినుపోలు రాఘవేంద్రప్రసాద్‌, పాలక మండలి సభ్యులతో సోమవారం దేవస్థాన సహా య కమిషనర్‌ అలవలపాటి ముకుందరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు పాలకమండలి చైర్మన్‌గా పినుపోలు రాఘవేంద్రప్రసాద్‌ను, సభ్యులుగా బి.శోభ, ఆర్‌.అనూష, లోమడల రామాంజులరెడ్డి, సి.రెడ్డయ్య, ఈశ్వర్‌రెడ్డి, గంగాభారతి, రేవతి, మునెమ్మ, కేసరి (అర్చక)లను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పులివెందుల నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ చైర్మన్‌, పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది సమన్వయంతో గండి క్షేత్రాన్ని అభివృద్ధిబాటలో నడిపించాలని కోరారు. అనంతరం చైర్మన్‌ను పలువురు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డి, వేంపల్లె జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి వివిధ శాఖల డైరెక్టర్లు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, ప్రసాదరావు, ప్రధాన అర్చకులు కేసరి, ఎంపీపీ మాధవి, బాలకృష్ణ, జడ్పీటీసీ శివప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్‌ అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement