మహిళపై యువకుడి అత్యాచార యత్నం

ABN , First Publish Date - 2021-06-19T05:47:15+05:30 IST

సమీప బంధువైన యువకుడు ఏర్పేడు మండలానికి చెందిన మహిళపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మహిళపై యువకుడి అత్యాచార యత్నం

ఏర్పేడు, జూన్‌ 18: ఏర్పేడు మండలానికి చెందిన మహిళపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రేణిగుంట డీఎస్పీ రామచంద్ర కథనం మేరకు... ఏర్పేడు మండలానికి చెందిన మహిళకు పాగాలి పంచాయతీకి చెందిన ఓ యువకుడు సమీప బంధువు. కాగా, ఈనెల 8న ఆమె పశువులు మేపేందుకు గ్రామ సమీపంలోని పొలం వద్దకు వెళ్లింది. అదే సమయంలో అక్కడున్న యువకుడు ఆ మహిళపై అత్యాచారయత్నం చేయగా ప్రతిఘటించింది. దీంతో గొంతు నులిమి హత్యచేసేందుకు ప్రయత్నించగా, ఎలాగోలా తప్పించుకుని ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అత్యాచారయత్నం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అనంతరం శ్రీకాళహస్తి కోర్టులో హాజరు పరచగా, జడ్జి ఆదేశాలతో రిమాండ్‌ నిమిత్తం యువకుడిని స్థానిక సబ్‌జైలుకు తరలించారు. 

Updated Date - 2021-06-19T05:47:15+05:30 IST