క్వారంటైన్‌కు ఏయూ హాస్టల్‌ గదులు

ABN , First Publish Date - 2020-06-06T08:23:13+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని నార్త్‌, సౌత్‌బ్లాక్‌లోని వసతిగృహాలను క్వారంటైన్‌

క్వారంటైన్‌కు ఏయూ హాస్టల్‌ గదులు

నార్త్‌, సౌత్‌ బ్లాక్‌లో కేటాయింపు

గదులను ఖాళీ చేస్తుండడంతో విద్యార్థుల ఆందోళన


విశాఖపట్నం, జూన్‌ 5, (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని నార్త్‌, సౌత్‌బ్లాక్‌లోని వసతిగృహాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా వినియోగించుకోనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికా రులకు జిల్లా యంత్రాంగం నుంచి ఆదేశాలు రావడంతో మొత్తం వసతిగృహాలను అప్పగించారు. వసతిగృహాల్లో ఉన్న సుమారు రెండు వేల గదులను దేశ, విదేశాల నుంచి వస్తున్న వారిని క్వారంటైన్‌ చేసేందుకు వినియోగించనున్నారు. ఈమేరకు వసతిగృహాలను జిల్లా అధికారులు స్వాధీనం చేసుకుని క్వారంటైన్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. 


లగేజీలపై విద్యార్థుల ఆందోళన 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రూములు ఖాళీ చేసి విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. వారి పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఇతర లగేజీ రూముల్లోనే ఉన్నాయి. ఇప్పుడు గదులు ఖాళీ చేస్తే వాటిలోని లగేజీని ఏం చేస్తారోనని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే లగేజీ తీసుకువెళ్లేందుకు రావాలని విద్యా ర్థులకు సమాచారమిచ్చామని, రాలేని వారి లగేజీని రెవెన్యూ అధికారుల సమక్షంలో వీడియోతీసి, భద్రపరుస్తున్నామని, తరువాత అందజేస్తామని ఏయూ అధికారులు చెబుతున్నారు. ఈ బాధ్యతను హాస్టళ్ల చీఫ్‌వార్డెన్లకు అప్పగించినట్టు రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌ తెలిపారు.

Updated Date - 2020-06-06T08:23:13+05:30 IST