మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్‌తో కరోనా ముప్పునకు చెక్‌!

ABN , First Publish Date - 2021-04-21T07:42:38+05:30 IST

మల్టీ విటమిన్లు, ఒమేగా-3, ప్రో బయోటిక్స్‌, విటమిన్‌-డికి సంబంధించిన పోషకాలను తీసుకునే వారికి కరోనా ఇన్ఫెక్షన్‌ సోకే ముప్పు తగ్గుతుందని బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు...

మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్‌తో కరోనా ముప్పునకు చెక్‌!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: మల్టీ విటమిన్లు, ఒమేగా-3, ప్రో బయోటిక్స్‌, విటమిన్‌-డికి సంబంధించిన పోషకాలను తీసుకునే వారికి కరోనా ఇన్ఫెక్షన్‌ సోకే ముప్పు తగ్గుతుందని బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసే ఒక ప్రత్యేక యాప్‌లో 3.72 లక్షల మంది బ్రిటన్‌ పౌరులు పొందుపరిచిన వివరాల విశ్లేషణలో ఈ విషయాన్ని గుర్తించారు. 2020 మే నుంచి జూలై మధ్యకాలంలో ఈ అధ్యయనం జరిగింది. ఈ వ్యవధిలో 1.75లక్షల మంది విటమిన్లకు సంబంధించిన పోషకాలను తీసుకోగా, 1.97లక్షల మంది వాటిని తీసుకోలేదు. మొత్తం 3.72లక్షల మందిలో 23వేల మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తేలింది.

Updated Date - 2021-04-21T07:42:38+05:30 IST