చట్టాలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-09-18T05:42:37+05:30 IST

గ్రామాల్లోని ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని టెక్కలి సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.హరిత అన్నారు. తిర్లంగి గ్రామ సచివాలయ ఆవరణలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆఽధ్వర్యంలో శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.

చట్టాలపై అవగాహన అవసరం

టెక్కలి: గ్రామాల్లోని ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని టెక్కలి సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.హరిత అన్నారు. తిర్లంగి గ్రామ సచివాలయ ఆవరణలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆఽధ్వర్యంలో శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. సమావేశంలో సీఐ ఆర్‌.నీలయ్య, తహసీల్దార్‌ బి.నాగభూషణ రావు, సర్పంచ్‌ సనపల మౌనిక తదితరులు పాల్గొన్నారు. 



 తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే..

కోటబొమ్మాళి: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్య పిల్లలదేనని జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు అన్నా రు.  శుక్రవారం స్థానిక వంశధార డ్రిగీ కళాశాలలో  న్యాయ విజ్ఞా న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మహిళలపై అత్యాచారా లు, బాలికలు తప్పిపోవడాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో కలిసి ప్రయాణం చేయవద్దన్నారు. న్యాయవాదులు డి.నర్సింహమూర్తి, కరస్పాండెంట్‌ సీహెచ్‌ అనిరుద్రుడు, విద్యార్థులు పాల్గొన్నారు. 



 

Updated Date - 2021-09-18T05:42:37+05:30 IST