వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-10-28T04:54:36+05:30 IST

మలేరియా, చికన్‌ గున్యా, డెంగీ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రగడపల్లి సర్పంచ్‌ కలుం బాపిరాజు సూచించారు.

వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నివాసాలలో మలాథియాన్‌ పిచికారీ

పోలవరం, అక్టోబరు 27: మలేరియా, చికన్‌ గున్యా, డెంగీ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రగడపల్లి సర్పంచ్‌ కలుం బాపిరాజు సూచించారు. గుంజవరం గ్రామంలో మలే రియా నివారణకు బుధవా రం మలాథియాన్‌ పిచికారీ చేశారు. సర్పంచ్‌ బాపిరాజు మాట్లాడుతూ అనారో గ్యాలతో ప్రాణహాని జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. నివాసాలు, పశువుల పాకలు, నీటి నిల్వ ఉన్న ప్రాంతాలలో మలాథియాన్‌ పిచికారీ చేయించుకో వాలన్నారు. కార్యక్రమంలో మలేరియా నివారణ యూనిట్‌ సిబ్బంది చిన్నయ్య, శ్రీను, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎం పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T04:54:36+05:30 IST