Abn logo
May 13 2021 @ 23:20PM

కరోనాకు ఆయుర్వేద మందులు

రత్నాబయోటెక్‌ ఎండీ గంగిరెడ్డి


పలమనేరు, మే 13 : పలమనేరు మండలం కొలమాసనపల్లెలోని రత్నాబయోటెక్‌ ఆయుర్వేద మందుల తయారీ కంపెనీ కరోనాకు మందులను తయారు చేసిందని, అధ్భుత ఫలితాలు ఇస్తోందని ఆ సంస్థ ఎండీ గంగిరెడ్డి తెలిపారు. తాము రూపొందించిన ఈ కిట్‌లో నాలుగు రకాల మందులను అందజేస్తున్నామన్నారు.  జ్వరంతో ఉన్నప్పుడు ఫీవరాల్‌, దగ్గుకు ఆర్‌-కాఫ్‌, ఇమ్యూనిటీ కోసం రెజుఫోర్టు సిరఫ్‌, లంగ్‌ కేర్‌ కోసం హెర్బల్‌ ఇన్‌హెల్లరును  కలిపి కరోనా కిట్‌గా కేవలం రూ. 350లకే అందుబాటులో ఉంచామన్నారు. గతేడాది తమ గ్రామ పరిసరాల్లో 15 మందికి కరోనా పాజిటివ్‌ రాగా 13 మంది తమ మందులు వాడి కేవలం 3నుంచి 4 రోజుల్లోనే రికవరీ అయ్యారన్నారు.  ఇప్పటికే తాము దాదాపు 1000 మందికి ఉచితంగా కరోనా మందులను అందజేశామన్నారు. జిల్లా ఆయుష్‌ డాక్టర్‌ మోహనకృష్ణకు కూడా కరోనా రోగులకు ఇచ్చేందుకు 100 కిట్లను అందజేశామన్నారు.

Advertisement