Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 1 2021 @ 11:25AM

బాబుల్ సుప్రియో ప్లాన్‌ను ‘షోలే డ్రామా’గా అభివర్ణించిన టీఎంసీ!

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్ బీజేపీ నేత బాబుల్ సుప్రియో తాజాగా తాను రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సింగర్ నుంచి నేతగా మారిన బాబుల్ సుప్రియో తనపై వస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియా వేదకగా జవాబిస్తూ...  వారు వేస్తున్న ప్రశ్నలకు తన చేతల ద్వారా సమాధానమిస్తానని అన్నారు. తనకు ఎంపీని కావాలనే ఉద్దేశం లేదని, తనకు కొంత సమయం ఇవ్వాలని, గీతాగానం చేయాల్సి ఉందన్నారు. తనపై లేనిపోని విమర్శలు చేయడం తగదన్నారు. అప్పుడే తనలో సానుకూల ఆలోచనలు నిలిచివుంటాయన్నారు. అయితే బాబుల్ సుప్రియో వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ నేత కుణాల్ ఘోష్... అవన్నీ నాటకాలని, బాబుల్ సుప్రియోదంతా ‘షోలే డ్రామా’ అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement