Advertisement
Advertisement
Abn logo
Advertisement

బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

 వేములవాడ, నవంబరు 30 : వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడకు తరలివచ్చిన భక్తులు మంగళవారం భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం మొక్కు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలో నిరీక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Advertisement
Advertisement