Abn logo
Oct 18 2021 @ 09:02AM

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు..బద్రీనాథ్ యాత్ర halted

డెహ్రాడూన్(ఉత్తరాఖండ్): భారీవర్షాల వల్ల బద్రీనాథ్ యాత్రకు బ్రేకు పడింది. రాబోయే రెండు రోజుల పాటు చార్ధామ్‌తో సహా ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. దీంతో బద్రినాథ్ యాత్ర పాండుకేశ్వర్ వద్ద ఆగిపోయింది. భారీవర్షాల వల్ల వరదలు వెల్తువెత్తుతుండటంతో ప్రజలు నదులు, కాల్వలకు దూరంగా ఉండాలని ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాుల కురిసే అవకాశం ఉందని భారతవాతావరణశాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.

దీంతో ముందు జాగ్రత్తగా బద్రీనాథ్ యాత్రను నిలిపివేయాలని చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా భక్తులకు సూచించారు. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులను జోషిమఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షితంగా ఉండాలని ఖురానా కోరారు. చమోలీ జిల్లాలోని పాఠశాలలు,కళాశాలలను సోమవారం మూసివేశారు. వచ్చే రెండు రోజుల పాటు ఎక్కడికీ వెళ్లవద్దని వాతావరణ శాఖ డైరెక్టర్ బిక్రమ్ సింగ్ ప్రజలను కోరారు.ఆదివారం నుంచి మూడు రోజుల పాటు చార్ ధామ్‌తో సహా ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల మెరుపులు, వడగళ్ల వర్షంతోపాటు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

భారీవర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాబోయే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ,అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు.భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను రెండు రోజుల పాటు  వాయిదా వేశామని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.భారీవర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడుతున్నందున ఎస్‌డిఆర్‌ఎఫ్ 29 బృందాలను ఉత్తరాఖండ్ అంతటా మోహరించారు.భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో 19వతేదీ వరకు గోపేశ్వర్‌లోని నందా దేవి బయోస్పియర్ రిజర్వ్‌లోని అటవీ ప్రాంతాల్లోని అన్ని ట్రెక్కింగ్, క్యాంపింగ్, పర్వతారోహణ బృందాల పర్యటనలను నిషేధించారు.


ఇవి కూడా చదవండిImage Caption