Badvel By-Poll కౌంటింగ్.. అప్‌డేట్స్

ABN , First Publish Date - 2021-11-02T13:37:44+05:30 IST

బద్వేలు బరిలో ఎవరి బలం ఎంతో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది...

Badvel By-Poll కౌంటింగ్.. అప్‌డేట్స్

బద్వేలు ఉప ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరుగుతోంది. ఎవరి బలం ఎంతో నేడు తేలనుంది. ఉప ఎన్నిక ఫలితం కంటే.. పోటీ చేసిన ప్రధాన పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు, గెలిచే వారి మెజార్టీ ఎంత, రెండో స్థానంలో నిలబడే పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చు అనే దానిపైనే ఉత్కంఠ సాగుతోంది. శనివారం జరిగిన పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2,15,392 ఓట్లకు గాను 1,46,562 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ నేతలు లక్ష మెజార్టీ లక్ష్యంగా పెట్టుకోవడం, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా ఓట్లను పొందడం కోసం ఉప ఎన్నికలో హోరాహోరీగా ప్రచారంతో తలపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేసినా ఆమె మెరుగైన ఓట్లు తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నం చేశారు. వైసీపీ పెట్టుకున్న మెజార్టీ లక్ష్యాన్ని గట్టిగా దెబ్బకొట్టే విధంగా బీజేపీ ప్రయత్నం చేసింది. దీంతో ఈ రెండు పార్టీలే ఉప ఎన్నికలో ప్రధాన చర్చగా మారాయి. మంగళవారం బద్వేల్‌లో జరుగుతున్న కౌంటింగ్ వివరాల మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ మీకోసం..



పోస్టల్ బ్యాలెట్‌లో వైసీపీ ఆధిక్యం(8:45AM)

కడప జిల్లా/బద్వేలు: బద్వేల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్ బ్యాలెట్‌లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఈ బద్వేలు బరిలో ఎవరి బలం ఎంతో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఉప ఎన్నిక ఫలితం కంటే పోటీ చేసిన ప్రధాన పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు..? గెలిచే వారి మెజార్టీ ఎంత..? రెండో స్థానంలో నిలబడే పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చు..? అనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్‌ ఒక హాలులో కాకుండా నాలుగు హాళ్లలో చేపట్టనున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఇలాంటి ఏర్పాట్లు చేశారు. నాలుగు హాళ్లలో ఒక్కో హాలుకు ఏడు టేబుళ్లు ఏర్పాటు చేశారు.


మొత్తం 2,15,392 ఓట్లకు గాను 1,46,562 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్ల ప్రకారం దాదాపు అన్ని టేబుళ్లతో పది రౌండ్లు కౌంటింగ్‌ నుంచి గరిష్ఠంగా 12 రౌండ్ల వరకు సాగే అవకాశం ఉంది. అన్ని టేబుళ్లతో ఒక్కొక్క రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత వాటిని అన్నింటిని జోడించి ఆ రెండు ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత తుది ఫలితాల రౌండ్‌ కౌంటింగ్‌ ఒకదానికొకటి చేస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు, వికలాంగుల పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కౌంటింగ్‌కన్నా ముందే లెక్కిస్తారు. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌ సిబ్బంది పర్యవేక్షణలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు, జనరల్‌ ఏజెంట్లు కూడా కౌంటింగ్‌లో అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు సూచనలు ఇచ్చారు.


కాగా, సెంటిమెంట్‌తో టీడీపీ పోటీకి దూరంగా ఉండగా.. వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ, బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీ చేసిన సంగతి తెలిసిందే.


Badvel ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది. మొత్తమ్మీద నోటా, బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో వైసీపీ మెజార్టీ తగ్గిందని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగానే ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థిని చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,550 ఓట్ల భారీ మెజార్టీతో సుధా గెలుపొందారు.


కాగా చివరి రౌండ్ వరకూ బీజేపీ అభ్యర్థికి దక్కిన ఓట్లు 20 వేల ఓట్ల పైచిలుకు మాత్రమే. ఈ ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పోటీ చేయలేదు. దీంతో బీజేపీకి కూడా ఊహించిన దానికంటే ఎక్కువే ఓట్లు వచ్చాయని, గతంతో పోలిస్తే ఎక్కువగా ఓట్లు వచ్చాయని.. నియోజకవర్గంలో పార్టీ బలపడిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.


11వ రౌండ్‌లోనూ ఫ్యాన్ భారీ స్పీడ్‌.. (12:03 PM)

మొత్తం ఓట్లు : 1,45,981

వైసీపీ అభ్యర్థిని సుధాకు వచ్చిన మొత్తం ఓట్లు : 1,11,227

బీజేపీ అభ్యర్థి సురేష్‌కు వచ్చిన ఓట్లు : 21,567

కాంగ్రెస్ అబ్యర్ధి కమలమ్మకు వచ్చినఓట్లు : 5,968

 నోటాకు వచ్చిన మొత్తం ఓట్లు : 3629

11వ రౌండ్‌ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి సుధా ఆధిక్యం : 89,660 ఓట్లు


10వ రౌండ్‌లో పరిస్థితి ఇదీ.. (11:51 AM)

మొత్తం ఓట్లు : 1,39,293 ఓట్లు

వైసీపీ అభ్యర్థిని సుధాకు వచ్చిన మొత్తం ఓట్లు : 1,06,088 ఓట్లు

బీజేపీ అభ్యర్థి సురేష్‌కు వచ్చిన ఓట్లు : 20583 ఓట్లు

కాంగ్రెస్ అబ్యర్ధి కమలమ్మ కు వచ్చినఓట్లు : 5968 ఓట్లు

నోటాకు ఇప్పటి వరకూ వచ్చిన ఓట్లు : 3464 ఓట్లు

10 వ రౌండ్‌ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి ఆధిక్యం : 85,505 ఓట్లు


9 రౌండ్లు ముగిసే సరికి..:- (11:45 AM)

మొత్తం ఓట్లు : 1,26,688 ఓట్లు

వైసీపీ అభ్యర్థిని సుధాకు వచ్చిన మొత్తం ఓట్లు : 96,036 ఓట్లు

బీజేపీ అభ్యర్థి సురేష్‌ : 19029 ఓట్లు

కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ : 5,510 ఓట్లు

వైసీపీ అభ్యర్థిని సుధా ఆధిక్యం : 77,007


రికార్డ్ స్థాయిలో నోటాకు ఓట్లు..

బద్వేల్‌ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో నోటాకు ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకూ 8 రౌండ్లు పూర్తికాగా.. నోటాకు 2,098 ఓట్లు రావడం గమనార్హం. 8 రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి 68,492 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.


భారీ ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి..

వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ భారీ ఆధిక్యంలో ఉన్నారు. 8 రౌండ్లు ముగిసేసరికి 68,492 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొదట బ్యాలెట్ ఓట్లు నుంచే వైసీపీ అభ్యర్థి హవా మొదలైంది. అక్కడ్నుంచి ఒకటి, రెండో ఇలా ఇప్పుడు ఎనిమిదో రౌండ్ వరకూ సుధ లీడ్‌లో ఉన్నారు. 


7వ రౌండ్‌లో పరిస్థితి ఇదీ.. :

వైసీపీ అభ్యర్థి సుధాకు వచ్చిన మొత్తం ఓట్లు : 74,991

బీజేపీ అభ్యర్థి సురేష్‌ : 14,226 ఓట్లు

కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ : 4252 ఓట్లు

7వ రౌండ్‌ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి ఆధిక్యం : 60,765


6వ రౌండ్ :- (10:55 AM)

వైసీపీ అభ్యర్ది డాక్టర్ సుధా 52024  ఓట్ల ఆధిక్యం

వైసీపీ : 64,265 ఓట్లు

కాంగ్రెస్ : 3411

బీజేపీ :12241 

నోటా : 2098 


బద్వేల్‌లో ఐదో రౌండ్ కౌంటింగ్ పూర్తి (10:50 AM)

42,581 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ

ఐదో రౌండ్‌లో వైసీపీకి 11, 783, బీజేపీకి 1,797 ఓట్లు

ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 575 ఓట్లు


కొనసాగుతున్న వైసీపీ హవా..(10:43AM)

బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదో రౌండ్‌లో కూడా వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం ఐదు రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి సుధాకు 52,882, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 10,301, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 2,880 ఓట్లు లభించాయి. 


ఆధిక్యంలో వైసీపీ..(10:35AM)

నాలుగో రౌండ్ ముగిసే సరికి వైసీపీకి 41099 ఓట్లు, కాంగ్రెస్‌కు 2305, బీజేపీకి 8504, నోటాకు 1448 ఓట్లు లభించాయి.


బద్వేల్‌లో నాలుగో రౌండ్ కౌంటింగ్ పూర్తి(10.26AM)

బద్వేల్‌లో నాలుగో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యింది. 32,595 ఓట్లతో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్‌లో వైసీపీకి 9,867 ఓట్లు, బీజేపీకి 2,241 ఓట్లు వచ్చాయి. 


బద్వేల్‌లో మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తి..(9.50AM)

బద్వేల్‌లో మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యింది. 23,754 ఓట్లతో వైసీపీ అభ్యర్థి సుధ ఆధిక్యంలో ఉన్నారు.


బద్వేల్‌లో రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తి(9:45AM)

బద్వేల్‌లో రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ రౌండ్‌లో కూడా వైసీపీ అభ్యర్థి సుధ ఆధిక్యంలో ఉన్నారు.


బద్వేల్‌లో తొలి రౌండ్ పూర్తి(9:42AM)

బద్వేల్‌లో తొలి రౌండ్ పూర్తయ్యింది. 8,790 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ముందంజలో ఉన్నారు. వైసీపీకి 10,478, బీజేపీకి 1,688, కాంగ్రెస్‌కు 580, నోటాకు 342 ఓట్లు లభించాయి.


కొనసాగుతున్న బద్వేల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు(9:28AM)

బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నానికే పూర్తయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 10 నుంచి 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటలోపే వచ్చే వీలుందని సమాచారం.


Updated Date - 2021-11-02T13:37:44+05:30 IST