బాలాలయ తిరువీధుల్లో దుమ్ముతో అవస్థలు

ABN , First Publish Date - 2020-11-23T06:42:40+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పుననిర్మాణ పనుల పెద్దపెద్ద లారీలు, ట్రక్కులు బాలాలయ తిరు వీధుల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక వాహనం రాకపోకలతో విపరీతంగా దుమ్ము రేగుతున్నందున భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

బాలాలయ తిరువీధుల్లో దుమ్ముతో అవస్థలు
యాదాద్రి కొండపై బాలాలయం తిరువీధుల్లో రేగుతున్న దుమ్ము

 పట్టించుకోని ఆలయ అధికారులు ఫ భక్తుల ఇక్కట్లు

 యాదాద్రి, నవంబరు22(ఆంధ్రజ్యోతి): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పుననిర్మాణ పనుల  పెద్దపెద్ద లారీలు, ట్రక్కులు బాలాలయ తిరు వీధుల్లో  రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక వాహనం రాకపోకలతో  విపరీతంగా దుమ్ము రేగుతున్నందున భక్తులు ఇబ్బంది పడుతున్నారు.  ఈ దుమ్ము రేగకుండా దేవాలయ అఽఽధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని భక్తులు విమ ర్శిస్తున్నారు. అధికారులు తిరువీధుల్లో నీటిని చల్లించి దుమ్ము రేగకుండా దేవాలయ అధికారులు చర్యలు తీసుకోవాలని  భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 



‌ప్రెసిడెన్షియల్‌ సూట్‌ పనుల పరిశీలన 

 యాదాద్రి టౌన్‌, నవంబరు 22: యాదగిరిపల్లి శివారులో ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నిర్మాణ పనులను కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అదివారం పరిశీలించారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ పనుల పురోగతిపై అధికారులను కలెక్టర్‌ ఆరా తీశారు. పనులు కొనసాగుతున్న తీరును యాదాద్రి ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి కలెక్టర్‌కు వివ రించారు. 

Updated Date - 2020-11-23T06:42:40+05:30 IST