పన్ను వసూళ్లలో బల్దియా వెనుకంజ

ABN , First Publish Date - 2021-03-02T06:02:55+05:30 IST

అభివృధ్దికి బాటలు వేయాల్సిన జగిత్యాల బల్దియా పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తోంది. 2020-21 ఆర్ధిక సంవ త్సరంలో 11 మాసాలు గడిచినా కేవలం 67.22 శాతమే పన్నులు వసూ ళ్లు అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

పన్ను వసూళ్లలో బల్దియా వెనుకంజ
జగిత్యాల బల్దియా కార్యాలయం

11 మాసాల్లో 67 శాతమే 

ముంచుకొస్తున్న గడువు

బిల్‌ కలెక్టర్లు లేక ఇబ్బందులు

పట్టించుకోని అధికారులు

జగిత్యాల టౌన్‌, మార్చి 1: అభివృధ్దికి బాటలు వేయాల్సిన జగిత్యాల బల్దియా పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తోంది. 2020-21 ఆర్ధిక సంవ త్సరంలో 11 మాసాలు గడిచినా కేవలం 67.22 శాతమే పన్నులు వసూ ళ్లు అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మార్చి 2021 చివరి నాటికి పేరుకపోయిన బకాయిలను వసూలు చేస్తేనే బల్దియా అన్ని రంగాల్లో మరింత అభివృధ్ది చెందుతుందని మేధావులు పేర్కొంటున్నారు. పాలక వర్గంతో పాటు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రతి ఏటా 100 శాతం పన్ను వసూళ్లు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రతి నెల బిల్లులు వసూలు చేయాల్సిన బిల్‌ కలెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో వసూళ్లలో అధికారులకు ఇబ్బందులు తప్పడంలేదు. గడువు ముంచుకొస్తుండటంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని పన్నులు వసూలు చేయాలని కౌన్సిల్‌ సభ్యులే పేర్కొంటున్నారు. అధికారులు కూడా గడువు సమయం వచ్చినపుడే వసూళ్లపై దృష్టి పెడుతున్నారే త ప్ప మిగతా నెలల్లో పన్ను వసూళ్లపై సిబ్బందితో సమీక్షలు చేయకపో వడం 100 శాతం అమలు లక్ష్యం నేరవేరకపోవడానికి ప్రధాన కారణమని పలువురు పేర్కొంటున్నారు.

టాక్సెస్‌ డిమాండ్‌ రూ.772.57 లక్షలు... జగిత్యాల బల్దియా ఫస్ట్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ కావడంతో పాటు 48 వార్డులు ఉన్నాయి. లక్షా 50 వేలకు పైగా జనభా ఉన్న పట్టణంలో 23021 నివాస గృహాలున్నాయి. దీంతో పాటు 25 చోట్ల ప్రభుత్వ కార్యా లయాలు, 1050 కి పైగా ప్రైవేటు స్థలాలు, 80 కి పైగా ప్రకటనల బోర్డు లకు బల్దియా ప్రతి సంవత్సరం పన్నులు వసూలు చేస్తోంది. గత సంవ త్సరం పూర్తి స్థాయిలో బకాయిలు వసూలూ చేయకపోవడంతో రూ. 235.60 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను టాక్సెస్‌ డియాండ్‌ రూ. 536.97 లక్షలను నిర్ణయించారు. ఫిబ్రవరి 27 నాటికి పెండింగ్‌ బకాయిలు రూ.90.32 లక్షలు వసూలు చేయగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.428.97 లక్షలు 67.22 శాతం మాత్రమే వసూలు చేశారు. ఇంకా గడువుకు 29 రోజుల వ్యవధి మాత్రమే ఉం డడంతో రూ. 253.28 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ఖాళీగా

బిల్‌ కలెక్టర్‌ పోస్టులు..

జగిత్యాల బల్దియాలో 48 వార్డులు ఉన్నాయి. పన్నుల వసూలు చే సేందుకు అధికారులు జగిత్యాల పట్టణాన్ని ఎనిమిది బ్లాకులుగా విభ జించారు. పట్టణంలో ఉన్న జనాభా, గృహాలు ఇతర ఆదాయ మార్గాల ను బల్దియాకు సమకూర్చేందుకు 10 నుంచి 12 మంది బిల్‌ కలెక్టర్‌ పోస్టులు ఉండాల్సి ఉండగా కేవలం జగిత్యాల బల్దియాకు నాలుగు బిల్‌ కలెక్టర్‌ పోస్టులు మాత్రమే మంజూరయ్యాయి. మంజూరైన నాలుగు పో స్టుల్లో ఒకే ఒక ఉద్యోగి పూర్తి స్థాయి బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తుండగా రె వెన్యూ విభాగం, శానిటేషన్‌ విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్లుగా విధు లు నిర్వహిస్తున్న మరో ఏడుగురు సిబ్బంది పన్నులు వసూలు చేస్తు న్నారు. అయినప్పటికీ 100 శాతం లక్ష్యం సాధించడంలేదు.


Updated Date - 2021-03-02T06:02:55+05:30 IST