బాలికపై లైంగికదాడికి యత్నం

ABN , First Publish Date - 2021-05-07T03:14:49+05:30 IST

మండలంలోని నార్తురాజుపాలెంలో ఓ బాలిక(8)పై వృద్ధుడు గురువారం లైంగికదాడికి యత్నించాడు. స్థానికుల కథనం మేరకు, నార్తురాజుపాలెంలో చి

బాలికపై  లైంగికదాడికి యత్నం

 వృద్ధుడికి దేహశుద్ధి

కొడవలూరు మే 6 : మండలంలోని నార్తురాజుపాలెంలో ఓ బాలిక(8)పై వృద్ధుడు గురువారం లైంగికదాడికి యత్నించాడు. స్థానికుల కథనం మేరకు, నార్తురాజుపాలెంలో చిత్తుకాగితాలు ఏరుకోని జీవనం సాగిస్తున్న వృద్ధుడు  గ్రామంలోని పెద్దకాలువ సమీపంలో ఉన్న ముళ్లపొదల్లోకి ఆగ్రామానికి చెందిన ఓ బాలికను తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. సమయానికి అక్కడున్న స్థానికులు ఆ వృద్ధుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ  విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.


---------------


Updated Date - 2021-05-07T03:14:49+05:30 IST