యువతకు ఉపాధికల్పనకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కృషి

ABN , First Publish Date - 2021-01-21T06:13:25+05:30 IST

బ్యాంకింగ్‌ రంగంలోనే కాంకుడా యువతకు ఉపాధి అశకాశాలు కల్పించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ముందు భాగంలో నిలుస్తుందని బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాద్యిసింగ్‌ ఖిచి అన్నారు.

యువతకు ఉపాధికల్పనకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కృషి
ఎయిమ్స్‌ డైరెక్టర్‌కు అంబులెన్స్‌ అందజేస్తున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్యసింగ్‌ ఖిచి

బ్యాంక్‌  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాద్యిసింగ్‌ ఖిచి 

బీబీనగర్‌, జనవరి 20: బ్యాంకింగ్‌ రంగంలోనే కాంకుడా యువతకు ఉపాధి అశకాశాలు కల్పించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ముందు భాగంలో నిలుస్తుందని బ్యాంక్‌  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాద్యిసింగ్‌ ఖిచి అన్నారు.  బుధవారం ఏయిమ్స్‌ ప్రాంగణంలో సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచీని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియాతో కలిసి ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా బ్యాంక్‌  ఎయిమ్స్‌కు అంబులెన్స్‌ను అందించారు. ఈ సందర్భంగా విక్రమాదిత్య సింగ్‌ ఖిచి మాట్లాడుతూ దేశంలోనే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా టాప్‌-3లో ఉందని అన్నారు. ఏయిమ్స్‌ సంస్థలతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందన్నారు.  దేశంలో 69 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఫైనాన్సియల్‌ లిటరసీ సెంటర్‌, కౌన్సెలింగ్‌ సెంటర్స్‌ను నిర్వహిస్తున్నామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బ్యాంక్‌ ఆ్‌ఫ్‌ బరోడా సిబ్బంది ఎప్పటికప్పుడు మార్పు చెందుతున్నారని అన్నారు. ఏయిమ్స్‌ సిబ్బంది కోసం ఎంప్లాయిస్‌ సాలరీ ప్యాకేజీని తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటికే ఇండియన్‌ ఆర్మీ, నేవీ ఏయిర్‌ఫోర్స్‌ కోస్ట్‌ గార్డ్‌, సాలరీ ప్యాకేజీ కోసం కేంద్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్‌ ఆప్‌ భరోడా హైదరాబాద్‌ జోనల్‌ ఆఫీసర్‌ మన్మోహన్‌గుప్త,  ఏయిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనంతరావు, ఏయిమ్స్‌ డీన్‌ నీరజ్‌ అగర్వాల్‌, డీజీఎం కాంతారావు ఉన్నారు.  

Updated Date - 2021-01-21T06:13:25+05:30 IST