Abn logo
Oct 19 2020 @ 00:23AM

ఘనంగా బతుకమ్మ సంబరాలు

గౌరీదేవిపేటలో బతుకమ్మ సంబరాల్లో పూజలు చేస్తున్న మహిళలుKaakateeya

ఎటపాక, అక్టోబరు 18 : ఎటపాక మండలంలో బతకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మూడోరోజు ఆదివారం  సీతాపురం, గౌరీదేవిపేట, నెల్లిపాక,  నందిగామ గ్రామాల్లో సంబరాలను  ఘనంగా నిర్వహించారు. మహిళలు  భక్తి శ్రద్ధలతో వివిధ రకాల పువ్వులతో బతకమ్మలను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా బతకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడుతూ,  పాటలు పాడుతూ సందడి చేశారు. బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో - బంగారు బతకమ్మ ఉయ్యాలో.. అంటూ బతకమ్మ పాటలతో హోరెత్తించారు. మూడో రోజు ముద్ద పప్పు బతకమ్మను ఏర్పాటు చేశారు. ఈ బతుకమ్మ సంబరాలను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు.

Advertisement
Advertisement
Advertisement