బీసీ రిజర్వేషన్లపై ప్రధాన పార్టీలు మోసం

ABN , First Publish Date - 2020-12-04T06:05:06+05:30 IST

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీలు నోరెత్తకపోవడం మోసగించటమేనని ఏపీ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ విమర్శించారు.

బీసీ రిజర్వేషన్లపై ప్రధాన పార్టీలు మోసం
సమావేశంలో మాట్లాడుతున్న క్రాంతికుమార్‌

గుంటూరు, డిసెంబరు 3: స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీలు నోరెత్తకపోవడం మోసగించటమేనని ఏపీ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ విమర్శించారు. చుట్టుగుంట సెంటర్‌లోని కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కేవలం ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయే తప్ప ప్రజా ప్రయోజనాలే మాత్రం లేవన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టుకెళ్ళి పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. సమావేశంలో నాయకులు  రామకృష్ణ, ఉప్పుటూరి పేరయ్య, కొల్లికొండ వెంకటసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, మాల్యాద్రి, గోపికృష్ణ తదితరులున్నారు. 

Updated Date - 2020-12-04T06:05:06+05:30 IST