భూ సంబంధిత విషయాలలో కఠినంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2021-06-18T06:04:32+05:30 IST

భూ సంబంధిత విషయాలలో మరింత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు.

భూ సంబంధిత విషయాలలో కఠినంగా వ్యవహరించాలి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి

 జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి) : భూ సంబంధిత విషయాలలో మరింత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహ సీల్ధార్లతో వివిధ రెవెన్యూ సమస్యలపై జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడారు. కల్యాణ లక్ష్మి, షాధీ ముబారక్‌, నూతన రేషన్‌ కార్డుల దరఖాస్తుల పరిశీలన వెం టనే పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 747 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులకు అవసరమైన బడ్జెట్‌ వచ్చిందని వెంటనే పరిష్క రించాలని తెలిపారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన 507 బిల్లులు ట్రెజరీ కార్యాలయం ద్వారా పరిష్కరించామన్నారు. జనన దృవీకరణ ప త్రాల కోసం వచ్చే ధరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన తదుపరి పత్రా లు జారీ చేయాలన్నారు. ధరణి స్లాట్‌ బుక్కింగ్‌ ద్వారా 17,580 దరఖా స్తులు స్వీకరించగా 17,361 దరఖాస్తులను పరిష్కరించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రి యను పూర్తి చేశామన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరగా పూర్తిచేసే లా చూడాలని తెలిపారు. జిల్లాలో మ్యూటేషన్‌ ధరఖాస్తులు 46 పెండిం గ్‌లో ఉన్నాయన్నారు. 148 భూ సంబందిత సమస్యలతో ధరఖాస్తులు వ చ్చాయని, ఆధార్‌ సీడింగ్‌ 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అప్రూవల్‌ కోసం పంపించే ప్రతి దరఖాస్తును ఒకటికి రెండు పర్యాయా లు క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి పంపాలని ఆదేశించారు. జిల్లాలో కొ త్త రేషన్‌ కార్డుల కోసం 8 జూన్‌ 2021 వరకు 10,136 దరఖాస్తులను ఆ న్‌లైన్‌ ద్వారా స్వీకరించామన్నారు. ఆ దరఖాస్తులు తహసీల్ధార్‌ కార్యాల యం నుంచి వెరిఫికేషన్‌ చేసి పౌరసరఫరా శాఖాధికారులకు సమర్పిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల ఆర్డీఓలు మాదురి, వి నోద్‌ కుమార్‌, పలు మండలాల తహసీల్ధార్లు, కలెక్టర్‌ కార్యాలయ సూ పరెండెంట్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-18T06:04:32+05:30 IST