అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-21T04:56:16+05:30 IST

ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా మహిళలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖాధికారి కేపీ నాయుడు సూచిం చారు. మంగళవారం స్థానిక అగ్నిమా పక కార్యాలయంలో డ్వాక్రా సంఘా ల మహిళలకు అగ్ని ప్రమాదాలు నివారణపై అవగాహన కలిగించారు.

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
నరసన్నపేట: అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు

నరసన్నపేట:  ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా మహిళలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖాధికారి కేపీ నాయుడు సూచిం చారు. మంగళవారం స్థానిక అగ్నిమా పక కార్యాలయంలో  డ్వాక్రా సంఘాల మహిళలకు అగ్ని ప్రమాదాలు నివారణపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. 


అవగాహన అవసరం

పలాస: విద్యార్థులకు అగ్నిప్రమా దాలపై అవగాహన అవసరమని కాశీబుగ్గ అగ్నిమాపకశాఖ అధికారి ఎంఎస్‌వీ రవి ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయంలో డిగ్రీ విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌.అశోక్‌వర్దన్‌, వాసుదేవరావు పాల్గొన్నారు.


అగ్నిమాపక సేవలు అభినందనీయం

రాజాం రూరల్‌: ఏడాది పొడవునా అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలు ప్రసంశనీయమని  మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ అన్నారు. అగ్ని మాపక వారో త్సవాల్లో భాగంగా రాజాం ఫైర్‌స్టేషన్‌ ఆవరణలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆస్తులు, ప్రాణాల కాపాడడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు.  అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు చేపట్టే రక్షణ చర్యలను సిబ్బంది డెమో నిర్వహిం చారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ రాజాం శాఖ అధ్యక్షుడు కొత్తా సాయి ప్రశాంత్‌ కుమార్‌, ఎస్‌ఐ  కృష్ణమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.

 


 


Updated Date - 2021-04-21T04:56:16+05:30 IST