Abn logo
Jun 28 2021 @ 02:47AM

అందమైన సముద్రం!

కావలసినవి...

పేపర్‌ ప్లేట్లు, ఇసుక, చిన్న నత్తగుల్లలు, నీలం రంగు జిగురు, టిష్యూ పేపర్‌, తెల్లటి జిగురు, కత్తెర, మార్కర్స్‌.

ఇలా చేయాలి...

పేపర్‌ప్లేట్‌ తీసుకుని సగ భాగం వరకు తెల్లటి జిగురు పూసి, దానిపై ఇసుక చల్లాలి. ప్లేట్‌ కనిపించకుండా అంతటా సమంగా పట్టేలా చల్లుకోవాలి. 

ఇసుకలో అక్కడక్కడా నత్త గుల్లలు అంటించాలి. ఆరే వరకు కదపకుండా ఉంచాలి. 

టిష్యూ పేపర్‌ను తీసుకుని చేప బొమ్మలు గీసి కత్తిరించాలి. మార్కర్‌ సహాయంతో చేప కన్ను, మొప్పలు గీయాలి.

మిగిలిన పేపర్‌ ప్లేట్‌ సగ భాగంలో నీలం రంగు జిగురును బ్రష్‌ సహాయంతో పూయాలి. తరువాత చేప బొమ్మలను అంటించాలి. అంతే... అందమైన ఆర్ట్‌ రెడీ.