Advertisement
Advertisement
Abn logo
Advertisement

బేగంపేటలో క్లబ్ టాలీవుడ్ ప్రారంభం

హైదరాబాద్: బేగంపేటలోని కంట్రీక్లబ్ ఆవరణలో బుధవారం రాత్రి క్లబ్ టాలీవుడ్ పేరుతో నూతన పబ్‌ను ప్రముఖ మోడల్స్ ప్రారంభించారు. సువిశాలమైన స్థలంలో, కోవిడ్ నిభంధనలకు అనుగూణంగా పబ్ రూపొందించినట్లు నిర్వాహకుడు రాము తెలిపారు. సినిమా షూటింగులకు అనుకూలంగా, ఐటీ ఉద్యోగులు, పలు సంస్థలు, కిట్టీ పార్టీలు, పుట్టిన రోజు వేడుకలు, ఈవెంట్స్ చేసుకునేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతీ రోజు రకరకాల డీజే నైట్స్  ఎంతో అనుభవం కల్గిన వారితో లైవ్ బ్యాండ్ మ్యూజిక్ నిర్వహించనున్నట్లు తెలిపారు.


25 రకాల కాక్ టైల్స్, అనుభవం గల చెఫ్‌తో రుచికరమైన వెజ్, నాన్వెజ్ వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ధరల ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంటుందని రాము తెలిపారు. నగర వాసుల‌తో పాటు స్థానికేతరులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. పండుగల సెలెబ్రేషన్స్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తామని క్లబ్ టాలీవుడ్ నిర్వాహకుడు రాము పేర్కొన్నారు. క్రిస్మస్, న్యూయర్ సెలబ్రేషన్స్ కూడా తమ పబ్‌లో జరుపుకోవచ్చన్నారు. 

Advertisement
Advertisement