అణ్వస్త్ర దేశంగా బెలారస్‌!!

ABN , First Publish Date - 2022-02-28T08:46:19+05:30 IST

ఉక్రెయిన్‌పై పోరులో రష్యాకు పూర్తిగా మద్దతిస్తూ వస్తున్న బెలారస్‌.. అణ్వాయుధ దేశంగా అవతరించనుంది.

అణ్వస్త్ర దేశంగా బెలారస్‌!!

మిన్స్క్‌, ఫిబ్రవరి 27: ఉక్రెయిన్‌పై పోరులో రష్యాకు పూర్తిగా మద్దతిస్తూ వస్తున్న బెలారస్‌.. అణ్వాయుధ దేశంగా అవతరించనుంది. ఇందుకు అవకాశం కల్పిస్తూ రూపొందించిన కొత్త రాజ్యాంగం ఆమోదానికి దేశంలో ఆదివారం రెఫరెండం నిర్వహించారు. ఇది ఆమోదం పొందడం ఖాయమని అంచనా వేస్తున్నారు. సోవియట్‌ యూనియన్‌ నుంచి విడివడ్డాక.. బెలారస్‌ అణ్వాయుధాలను రష్యాకు అప్పగించింది. ఇప్పుడు వాటిని తిరిగి ఇవ్వాలని రష్యాను కోరతామని రెఫరెండం పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ సందర్భంగా బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-28T08:46:19+05:30 IST