గ్రామాల్లో బెల్టుషాపులు మూసివేయాలి

ABN , First Publish Date - 2022-03-13T06:49:43+05:30 IST

గ్రామాల్లో అక్రమంగా బెల్టు షాపులు (వైన్స్‌ షాపులు) నిర్వహిస్తున్న సంబందిత అధికారులు మామూలు మత్తులో ఉంటున్నారని, దీంతో మధ్యం ఏరులై పారుతుందని తెలం గాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి డాకూర్‌ తిరుపతి, జిల్లా కోశాధికారి నాగెల్లి నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు.

గ్రామాల్లో బెల్టుషాపులు మూసివేయాలి
మాట్లాడుతున్న వ్యవసాయకార్మిక సంఘం నాయకులు

ఎక్సైజ్‌ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు 

మూసివేయకపోతే  ధర్నాలు చేస్తాం 

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌

ఖానాపూర్‌ రూరల్‌, మార్చి 12 : గ్రామాల్లో అక్రమంగా బెల్టు షాపులు (వైన్స్‌ షాపులు) నిర్వహిస్తున్న సంబందిత అధికారులు మామూలు మత్తులో ఉంటున్నారని, దీంతో మధ్యం ఏరులై పారుతుందని తెలం గాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి డాకూర్‌ తిరుపతి, జిల్లా కోశాధికారి నాగెల్లి నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. ఖానాపూర్‌ పట్టణంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో శనివారం  ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గ్రామ సర్పంచ్‌, గ్రామ పెద్ద ఆధ్వర్యంలో బెల్టు షాపుల నిర్వహణ కోసం టెండర్లు వేసి రూ. లక్ష నుండి పది లక్షల వరకు వేలం పాట ద్వారా మధ్యం అమ్ము కునేందుకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. సంబందిత ఎక్సైజ్‌ అధికారులు ఇందుకు పరోక్షంగా సహకరిస్తూ మామూలుగా వ్యవహ రిస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతి ద్వారా అనధికారంగా టెండర్‌ వేసి అధికారికంగా మధ్యం విక్రయిస్తున్నారని, గుడుంబా అమ్మకాల పైన దాడులు చేసినట్లు బెల్టు షాపుల పైన దాడులు చేసి మూసివేయించాలని డిమాండ్‌ చేసారు. ఈ మద్యం విక్రయం వలన ఒక్కో గ్రామంలో 10 నుండి 20 మంది మహిళల భర్తలు తాగి చని పోయితున్నారని, వారి కుటుంబాల్లో విషాదం నింపుతున్నారని మహి ళలు విధవరాల్లుగా మారుతున్నారని అన్నారు. చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తు చేసారు. ఈ బెల్టు షాపులు వెంటనే బందు చేయకపోతే గ్రామల్లో ఉన్న బెల్టు షాపుల ముందర, జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయం ముందర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రైతు సంఘం మండ ల కార్యదర్శి బోసు భూమన్న, నలిమెల రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-13T06:49:43+05:30 IST