రాజీతో ఇరువర్గాలకు ప్రయోజనం

ABN , First Publish Date - 2022-06-27T05:22:29+05:30 IST

రాజీకి వస్తే ఇరువర్గాలకు ప్రయోజనం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఎన్‌. ప్రేమలత అన్నారు.

రాజీతో ఇరువర్గాలకు ప్రయోజనం
మాట్లాడతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత

 - జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. ప్రేమలత

సిరిసిల్ల క్రైం, జూన్‌ 26: రాజీకి వస్తే ఇరువర్గాలకు ప్రయోజనం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఎన్‌. ప్రేమలత అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు సముదాయంలో జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని పెండింగ్‌ కేసుల్లో దాదాపు 816 పరిష్కారం అయ్యాయ న్నారు. ఇందుకు పలు కేసుల్లో 41 లక్షల 35 వేల 983 రూపాయల చెల్లింపులు జరి గాయన్నారు. ఇందులో సిరిసిల్లలోని జిల్లా కోర్టులో 22,  సబ్‌ కోర్టులో 2,  పీడీఎం కోర్టులో 223, ఏడీఎం కోర్టులో 151, రెండో శ్రేణి కోర్టులో 418 కేసులు పరిష్కా రమైనట్లు వివరించారు. రాజీ మార్గం ఉన్న క్రిమినల్‌,  అన్ని సివిల్‌ కేసులకు లోక్‌ అదాలత్‌లో పరిష్కారం లభించిందన్నారు.  భూ తగాదాలు, బ్యాంకు రుణాలు, కుటు ంబ కలహాలు తదితర కేసుల్లో లోక్‌ అదాలత్‌ ద్వారా సేవలు వినియోగిం చుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు లోక్‌ అదాలత్‌లో వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. ఇందులో భాగంగానే ఈ లోక్‌ అదాలత్‌లో ఒక రోడ్డు ప్రమాదం కేసును ఏడునెలల్లో పరిష్కరించినట్లు చెప్పారు. ఇరువర్గాల్లోని కక్షిదారుల్లో ఎవరికైనా ఆర్థిక స్థోమత లేకపోతే న్యాయసేవా సంస్థను సంప్రదిస్తే సేవలు అందిస్తుందన్నారు.  ఒక సారి  లోక్‌ అదాలత్‌లో కేసు పరిష్కారమైతే ఆ కేసులో ఏ కోర్టుకు వెళ్లే అవకాశం లేదన్నారు. ప్రతీ  లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లోక్‌ అదాలత్‌ తీర్పు అంతిమం అన్నారు.  కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సౌజన్య, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి శాస్వత, లోక్‌ అదాలత్‌ సభ్యుడు చింతోజి భాస్కర్‌,  బార్‌  అసోసియేన్‌ కార్యదర్శి అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. 

కక్షిదారులు ముందుకురావాలి 

వేములవాడ: కక్షిదారులు రాజీ మార్గం ద్వారానే సమస్యలను పరిష్కరించుకు నేందుకు ముందుకు రావాలని వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రతీక్‌ సిహాగ్‌ అన్నారు. ఆదివారం నాడు వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలు, కొన్ని సమస్యలను కేసుల దాకా లాగి సమయం వృఽథా చేసుకోకుండా  లోక్‌ అదాలత్‌లో రాజీమార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఆదివారం మొత్తం 536 కేసులు లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించారు.  లోక్‌ అదాలత్‌ సభ్యులు నాగుల సత్యనారాయణ, నక్క దివాకర్‌, చెన్నమాదవుని రామరాజు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేముల సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుడిసె సదానం దం, న్యాయవాదులు ఐల్నేని కిషోర్‌ రావు, పొత్తూరి అనిల్‌ కుమార్‌, జంగం అంజ య్య, కాతుబండ నర్సింగరావు, ౅బొడ్డు ప్రశాంత్‌, గంగరాజు, సుజాత ఉన్నారు. 

Updated Date - 2022-06-27T05:22:29+05:30 IST