Abn logo
Oct 16 2021 @ 12:19PM

బెంగళూరు restaurantsకి గడ్డు కాలం

బెంగళూరు : ఓ వైపు కోవిడ్ మహమ్మారి, మరోవైపు తరచూ పెరుగుతున్న వంట గ్యాస్ సిలిండర్ల ధరలతో హోటళ్ళు, రెస్టారెంట్లు చిక్కుల్లో పడ్డాయి. కార్యకలాపాల పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చినప్పటికీ, ఇక్కడ అమ్మే ఆహార పదార్థాల ధరలను పెంచకపోవడంతో లాభదాయకత తగ్గింది. 


హోటళ్ళలో వాడే వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1,595. కాస్త పెద్ద హోటల్‌కు రోజుకు దాదాపు ఆరు సిలిండర్లు అవసరమవుతాయి. వీటి ధరలు పెరుగుతున్నప్పటికీ, ఇక్కడ అమ్ముతున్న ఆహార పదార్థాల ధరలను పెంచలేకపోతుండటంతో లాభాలు తగ్గుతున్నట్లు యజమానులు వాపోతున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ధరలు తమను వేధిస్తున్నాయని చెప్తున్నారు. హోటల్ వ్యాపారం చేయడం చాలా కష్టంగా మారిందని అంటున్నారు. 


రోజుకు ఒక సిలిండర్‌ను వాడే చిన్న తరహా హోటళ్ళ యజమానులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలతో తాము దెబ్బతింటున్నామని చెప్తున్నారు. అద్దెలు కూడా పెరిగిపోతున్నాయని, తమకు లాభాలు తగ్గిపోతున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్న రెస్టారెంట్లలో కొన్నిటిని మూసేశారు.


ఇవి కూడా చదవండిImage Caption