Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ వసతిగృహాల్లో ఈ ఏడాది మెరుగైన వసతులు

జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి వెంకటయ్య

ఆత్మకూరు, డిసెంబరు 7 : జిల్లాలోని బీసీ ప్రభుత్వ వసతిగృహాల్లో ఈ ఏడాది మెరుగైన వసతులు సమకూర్చే దిశగా ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి వై వెంకటయ్య తెలిపారు. మంగళవారం రాత్రి ఏబీసీడబ్ల్యూ ఎం. శ్రీదేవితో కలసి ఆయన ఆత్మకూరులోని బీసీ బాలికల, బాలుర వసతిగృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ తప్పని సరిగా అమలు చేయాలన్నారు. క్రమం తప్పకుండా విద్యార్థులకు మెడికల్‌ చెకప్‌ క్యాంపులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మెనూ ప్రకారం రుచి, శుచికరమైన పౌష్టికాహారం  అందించాలన్నారు. కాచి చల్లార్చిన నీరు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రత్యేక స్టడీ అవర్స్‌ కొనసాగిస్తున్నామన్నారు.  పరీక్ష ఫలితాల్లో కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా బీసీ సంక్షేమ వసతిగృహాలు ముందంజలో ఉన్నాయన్నారు. వసతిగృహాల్లో మౌలిక వసతులు, మెనూ నిర్వహణ తీరుపై తల్లిదండ్రుల సమావేశాల్లో చర్చించాలన్నారు. ప్రభుత్వ కళాశాల వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మాణం చేపట్టేదిశగా కలెక్టరుకు ప్రతిపానలు పంపామన్నారు. కార్యక్రమంలో బీసీ వసతిగృహాల సంక్షేమ అధికారులు పి. విజయలక్ష్మి, పి.మమత, షేక్‌ షకీల్‌  పాల్గొన్నారు. 


Advertisement
Advertisement