చలిలో వర్క్అవుట్ చేయడం కష్టంగా ఉందా? అయితే ఈ విధంగా ఆహారాన్ని తీసుకుని బరువు తగ్గండి!

ABN , First Publish Date - 2021-12-27T14:09:44+05:30 IST

చలికాలంలో శరీర బరువును..

చలిలో వర్క్అవుట్ చేయడం కష్టంగా ఉందా? అయితే ఈ విధంగా ఆహారాన్ని తీసుకుని బరువు తగ్గండి!

చలికాలంలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే చలిలో వర్క్‌అవుట్ చేయాలని ఎవరికీ అనిపించదు. ఇటువంటి పరిస్థితిలో, మీరు తీసుకునే ఆహారంపై మరింత శ్రద్ధ వహించాలి. బరువు తగ్గేందుకు వ్యాయామం ఒక్కటే సరిపోదని, అందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా ఎంతో అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ఆహారం తీసుకోవడానికి సంబంధించి చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు ఏది తిన్నా సరైన సమయంలో తినాలి. ఫలితంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు.


హెవీ బ్రేక్‌ఫాస్ట్

నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజంతా మీ ఆకలిని అదుపులో ఉంచుకునేందుకు ఉదయం భారీ అల్పాహారం తీసుకోవడం అవసరం. మీరు ఉదయం అల్పాహారం తీసుకోకపోతే, అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదయం 7 గంటల తర్వాత అల్పాహారం తీసుకోవడానికి ఉత్తమ సమయం. 

లంచ్

మధ్యాహ్న భోజనంలో ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. లంచ్ అనేది రోజంతా మీ శరీరానికి శక్తిని అందిస్తుంది. మీరు మీ మధ్యాహ్న భోజనంలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మధ్యాహ్నం 12:30 నుండి  ఒంటిగంట మధ్య లంచ్‌కు ఉత్తమ సమయం. 

డిన్నర్ 

శరీర బరువు తగ్గించడంలో డిన్నర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. రాత్రిపూట సరైన సమయానికి భోజనం చేస్తే, అది త్వరగా జీర్ణమై సరైన నిద్ర పడుతుంది. రాత్రి వేళ భోజనం ఆలస్యంగా తీసుకుంటే జీర్ణక్రియ మందగిస్తుంది. మీరు సరైన సమయానికి డిన్నర్ చేయకపోతే, అది మీ నిద్రకు భంగం కలిగించడమే కాకుండా, గ్యాస్ సమస్యతోపాటు అజీర్ణానికి దారితీస్తుంది. 

Updated Date - 2021-12-27T14:09:44+05:30 IST